మార్చిన వార్తా విశేషాలు - గురు వారం మార్చి   11th 2010 - 10:07 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
వేగం + సాహసం = వైఎస్‌
మంగళ వారం, నవంబర్ 03, 2009 , 10:43 [IST]

ys rajasekhar'నిత్య కృషీవలుడు వైఎస్‌ పుస్తకావిష్కరణలో సిఎం రోశయ్య
హైదరాబాద్‌, నవంబర్‌ 2, ప్రభాతవార్త :
దివంగత నేత వైఎస్‌ నిర్మించినబాటలో  దారి తప్పకుండా, అడుగు తప్పకుండా తాను నడుస్తానని, ఇదే తన ముందున్న ప్రధాన కర్తవ్యమని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వ్యాఖ్యానించారు. అసాధ్యా లను సుసాధ్యాలను చేసి  చిరస్మరణీయ నేతగా చరిత్ర పుటలలో తన స్థానాన్ని పదిలం చేసు కొన్న  మహోన్నత నేత వైఎస్‌ అని ఆయన అబి µవర్ణించారు. సమాజంలోని అన్నీ వర్గాల ప్రజలకు సంపూర్ణప్రభుత్వఅండదండలనుఅందించిన ఘన నేతగా  ఆయన కీర్తిని  జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని ఆయన గుర్తు చేశారు.

సోమవారం జూబ్లీహాలులో  కిసాన్‌ ఖేత్‌ మజ్దూర్‌ కాంగ్రెస్‌ నిర్వహణలో 'నిత్యకృషీవలుడు వైఎస్‌ అనే  పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా  పాల్గొన్న సిఎం వైఎస్‌ దార్శనికతను గురించి ఎంతచెప్పినా ఇంకా చెప్పా ల్సిందిమిగిలివుంటుందనివిపులీకరించారు. కిసాన్‌ కాంగ్రెస్‌తరపున  వైఎస్‌కు నివాళుర్పించేందుకు ఈ కార్యక్రమాన్ని  ఏర్పాటు  చేశారు. రైతుకు వెన్నుదన్నుగా  నిలిచి రైతునేస్తంగా, మహిళలకు అన్నగా, ప్రభుత్వోద్యోగులకు  కుటుంబ పెద్దగా ఆయన  సమాజంలోని అన్ని వర్గాలకు సంపూర్ణ ప్రభుత్వ అండదండలందించేందుకు సాహసంగా, వేగంగా, ధైౖర్యంగా పని చేశారని ముఖ్యమంత్రి అన్నారు.

కొంతమంది  తెరవెనుక  అద్భుతంగా పని చేయగలుగుతారని, తాను ఆవిధంగా పని చేయలేనని, కెవిపితెరవెనుక బాగాపనిచేసి వైఎస్‌ విజయాలకు వెన్నుదన్నుగా నిలిచారని రాజ్యసభ సభ్యులు, ప్రభుత్వసలహాదారు కెవిపి రామచం ద్రరావుపై  ముఖ్యమంత్రి   సున్నితంగా వ్యాఖ్య చేశారు. సభలో ఈ వ్యాఖ్యతో కలకలం లేచింది. రైతులకు ఉచితవిద్యుత్తు కాంగ్రెస్‌పాలకులు ఇవ్వ లేరని కొందరు వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో 12రూపాయలకు యూనిట్‌ చొప్పున కొనుగోలు చేసి వై.ఎస్‌. రైతుబాంధవు య్యారని ఆయన పేర్కొన్నారు.రైతులకు రుణాలమాఫీ పథకాన్ని  యుపిఏ ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకువచ్చారని, క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లి స్తున్న రైతులకు మేలు చేసేందుకు రూ.1850 కోట్ల రూపాయలను రైతులకు నజరానాగా ఇచ్చారని ఆయన చెప్పారు. ఉదాత్తత, మృదుత్వం ఆయనకు జన్మతః వచ్చిన మంచి లక్షణాలను కొణిజేటి చెప్పారు. అనేక కారణాలతో రైతులకు శ్రమకు తగిన ఫలితం లభించడం లేదని, పరిశ్రమల ఉత్పత్తుల ధరలను శాస్త్రీయంగా నిర్ణయించిన పద్దతిలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నిర్ణయించే పద్దతి కరవయ్యిందని ఆయన అన్నారు.

పిసిసి అధ్యక్షుడు  ధర్మ పురి శ్రీనివాస్‌ ప్రసంగిస్తూ వైఎస్‌ తన పరిపాలనాకాలంలో రైతు పక్షపాతిగా నిలిచారని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి  మాట్లా డుతూ ముఖ్యమంత్రి హోదాలో వై.ఎస్‌ తొలిసంతకం రైతులకు సంబంధిం చిన ఉచితవిద్యుత్తును ఫైలుపైన చేశారని, కాకతాళీయంగా చివరిసభకూడా రైతుల సమష్టి వ్యవసాయానికి సంబంధించిన సమావేశమేనని, తద్వారా ఆయన చివరి శ్వాసవరకు రైతులకోసం నిలిచారని అన్నారు. రాజశేఖరరెడ్డి ఆశయాల కొనసాగింపుగానే రోశయ్య అధికారాన్ని అందుకున్నారని అన్నారు.

వై.ఎస్‌ రూపొందించిన పథకాలన్నీ ఆర్థిక మంత్రి రోశయ్య అందించిన అండ దండల కారణంగానే విజయవంతమయ్యాయని వ్యవసాయమంత్రి పేర్కొ న్నారు.మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్‌ మాట్లాడుతూ వై.ఎస్‌ దార్శని కతకు పులివెందులలో ఏర్పరిచిన అంతర్జాతీయ పశుకేంద్రం, జాతీయ మత్స్య ఫెడరేషన్‌ నిదర్శనాలని అన్నారు. కొల్లి నాగేశ్వరరావు ప్రసంగిస్తూ  రైతుల సమస్యలను చెప్పగానే వెనువెంటనే స్పందించి సమస్య తీవ్రతలను గుర్తించి పరిష్కరించిన నాయకుడుగా ఆయన రైతులలో హృదయాలలో నిలిచి ఉంటారని అన్నారు. 

సీనియర్‌ నాయకులు చెన్నమనేని రాజేశ్వరరావు, రైతునాయకుడు పి.నర్సారెడ్డి, రైతునేస్తం వెంకటేశ్వరరావు, రైతు సమాఖ్య నాయకుడు చెంగ ళ్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి వట్టి వసంతకుమార్‌, ఎంఎల్‌సి  పొంగులేటి సుధాక ర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్య క్షుడు కోదండరెడ్డి సభకు స్వాగతం చెప్పారు.

 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 మైనింగ్‌ మాఫియాకు సర్కార్‌ దన్ను
 మెడపెట్టి గెంటినా చూరు పట్టుకు..
 పరిహారంలోనూ పరిహాసం!
 'ఇంటర్‌'లో 60 వేల మంది డుమ్మా
 లక్ష్మీపార్వతితో బాలకృష్ణ భేటీ
 ఇంటర్‌ జవాబుపత్రం నిండా జై తెలంగాణ
 రోశయ్యకు అస్వస్థత
 విద్యుత్‌ సమస్యపై అసెంబ్లీలో గరం..
 తెలంగాణ కోసం సంతకాలు చేయని..
 ఐటి, పరిశ్రమల భద్రతకు..
 
 
ముఖ్య వార్తలు
  చంద్రబాబును దూషిస్తే సహించం
  మహిళాబిల్లుతో ఎంపీల్లో ఆనందం
  ఎట్టకేలకు మహిళకు పట్టం
  'చెన్నై సూపర్‌ కింగ్స్‌'కు బౌలర్ల..
  అతిగా జీతాలు ఇవ్వకండి
  మార్కెట్లోకి ఫోర్డు పైగో కారు
  రోజాలు పూయించే బులియన్‌ స్టిచ్‌
  అతివలకు అందివస్తున్న అవకాశాలూ,..
  రజనీ అయితే ఓకే!
  'ఏమాయ చేసావె' విజయానందం
నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా...?
అవును
కాదు
చెప్పలేం
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com