| శ్రీకృష్ణ కమిటీ దుబ్బాకలో పర్యటించాలి |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 6:08 [IST] |
 |
|
|
దుబ్బాక, మార్చి 11, ప్రభాతవార్త : దుబ్బాకలో తెలంగాణోద్యమంలో భాగంగా రిలే దీక్షలు 72 రోజులుగా కొనసాగుతున్నాయి. దీక్షలకు అన్ని వర్గాలనుంచి అపూర్వ స్పందన లభిస్తుండగా దీక్షల్లో పాల్గొనేందుకు పోటీ పడుతున్నారు. గురువారం నాటి దీక్షలో దుబ్బాక వెలుగు గ్రామైఖ్య సంఘాల సభ్యులు బాలమణి, లలిత, వడ్లకొండ యాదమ్మ, కళావతి, బాల్‌రాజవ్వ, లత, సంధ్య, జయలక్ష్మి, వెంకటవ్వ, హేమలత, కళావతి, శర్మ పాల్గొనగా జెఎసి నాయకులు రొట్టె రాజమౌళి, సిద్దిరాములు, గుండెల్లి ఎల్లారెడ్డి, ఆస యాదగిరి, అంబటి బాలేశ్ గౌడ్, గడీల జనార్దన్‌రెడ్డి సంఘీభావం ప్రకటిం చారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టే వరకుతెలంగాణ ఆందో ళన కొనసాగుతుందని, దుబ్బాకలో శ్రీకృష్ణ కమిటీ పర్యటించాలని జెఎసి నేతలు డిమాండ్ చేశారు.
|
|
|
|
|
|
|