| 13న ఐటిడిఎ సమావేశాన్ని అడ్డుకోవాలి |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 6:05 [IST] |
 |
|
|
ములుగు : ఏటూరునాగారంలోని ఐటిడిఎ కార్యాలయంలో ఈనెల 13న జరిగే గవర్నింగ్‌బాడీ సమావేశాన్ని తెలంగాణ వాదులు, మండల జెఎసిలు అడ్డుకోవాలని నియోజకవర్గ జెఎసి కోఆర్డినేటర్‌లు జలగం మోహన్‌రావు, నల్లెల్ల కుమారస్వామి, చాప బాబుదొర లు పిలుపునిచ్చారు. గురువారం జరిగిన జెఎసి సమావేశంలో వారు మాట్లాడుతూ రాజీనామాలు చేయని నాయకులు ఏ కార్యక్రమానికి వచ్చినా అడ్డుకుంటామని, దీనికోసం తెలంగాణవాదులంతా సిద్ధంగా ఉండాలని వారు పిలుపు నిచ్చారు. సమావేశంలో జెఎసి కోకన్వీనర్‌లు పోరిక గోవింద్‌నాయక్, చింతలపూడి భాస్కర్‌రెడ్డి, సురేష్, సారయ్య, ప్రభాకర్, బుచ్చిరెడ్డి, యాదగిరిగౌడ్, భూక్య లాల్‌సింగ్, జంపాల రవీందర్, స్వరూప, రాజేందర్, శంకర్ పాల్గొన్నారు.
|
|
|
|
|
|
|