| .ఫీజు రీఎంబర్స్‌మెంట్ విడుదల చేయాలి |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 5:57 [IST] |
 |
|
|
ములుగు, మార్చి 11, ప్రభాతవార్త : విద్యా సంవత్సరం పూర్తికావస్తున్నా ఇప్పటివరకు కళాశాల విద్యార్థులకు స్కా లర్‌షిప్‌లు, ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వ కపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని, వెంటనే ప్రభుత్వం వా టిని విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డివి జన్ ఉపాధ్యక్షుడు రత్నం ప్రవీణ్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. ఈసారి 25.88లక్షల మంది విద్యా ర్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకుంటే 2355లక్షల మందిని మాత్ర మే ఎంపిక చేసి అందులో నుండి 22. 59 లక్షల మందికి స్కాలర్‌షిప్‌లు ఇస్తా మనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు విద్యార్థులందరికీ ఉపకార వేతనాలు ఇస్తామని చెప్పి నేడు విస్మ రిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ విద్యా సంవత్సరానికి రూ.2,488కోట్ల ను కేటాయించి కేవలం రూ.1300కోట్లు మాత్రమే విడుదల చేశారని పేర్కొన్నా రు. వెంటనే స్కాలర్‌షిప్, రీఎంబర్స్ మెంట్‌లను విడుదల చేయాలని డిమాం డ్ చేశారు. లేనట్లయితే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వ ర్యంలో ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
|
|
|
|
|
|
|