|
బచ్చన్నపేట, మార్చి 11, ప్రభాతవార్త : కరెంటు కోతపై రామచంద్రాపురం రైతన్నలు కన్నెర్ర చేశారు. గత నాలుగు రోజు లుగా త్రీఫేజ్ కరెంటు సరఫరా అస్తవ్యస్తంగా మారటంతో పొలాలు ఎండిపోయి బీటలు వారుతున్నాయంటూ మండలకేంద్రంలోని చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహిం చారు. దీంతో 5గంటల పాటు జనగామ, సిద్దిపేట, ఆలేరు ప్రధాన రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎండిపోయిన వరి దుబ్బులతో ఎంపిటిసి ముక్క సువర్ణస్వామి, సర్పంచ్ ఆముదాల లక్ష్మిమల్లారెడ్డి, గౌడ సంఘం నేత బండ పల్లి శంకరయ్య నేతృత్వంలో వందలాది మంది రైతులు తరలివచ్చి బైఠాయించారు. త్రీఫేజ్ సరఫరా దాదాపు పూర్తిగా నిలిపివేస్తుండడంతో తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు సైతం దొరకటం లేదంటూ రైతు సంఘం నేతలు మండిపడ్డారు. రాజకీయ నాయకుల మాదిరిగా హామీలు ఇస్తున్న అధికారులు అమలును మాత్రం పట్టించు కోకుండా రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని విమర్శించారు. ఆందోళన వి షయం తెలుసుకున్న ఎఇ మహేందర్ సంఘటనా స్థలానికి వచ్చి నచ్చజెప్పేయత్నం చేసినా రైతులుపట్టించు కోకపోగా ఆగ్రహంతో ఊగిపోయారు.డిఇఇవచ్చి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఎడిఇ కిరణ్‌కుమార్ వచ్చి పైనుండే సమస్య నెలకొందని, విద్యుత్‌లో అంతరాయం కలగకుండా చూస్తామంటూ హామీ ఇవ్వడం తో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బక్కెర సిద్దయ్య, రైతులు పాల్గొన్నారు
|