| రేషన్ కార్డు లబ్దిదారులకు నోటీసులు జారీ |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 5:50 [IST] |
 |
|
శంకర్‌పల్లి, మార్చి 11, ప్రభాతవార్త: శంకర్‌పల్లి మండల వ్యాప్తంగా మొత్తం 4451 రేషన్ కార్డు లబ్దిదారులకు నోటీసులు జారీ చసినట్లు తహసీల్దార్ జగన్నాధం తెలిపారు. మూడు రోజులుగా మండల స్థాయి అధికారులందరూ నాలుగు బందాలుగా విడిపోయి 25 గ్రామాలలో మెరుపువేగంతో గ్రామ సభలు పూర్తి చేశారు.
ప్రజల నిరసనల మధ్యనోటీసులు జారీ చేశారు. మండలంలో మొత్తం రేషన్‌కార్డులలో 4451 కార్డుల లబ్దిదారులను అనర్హుల జాబితాలో చేర్చి వారి పేర్ల తొలగింపునకు సంబంధించినవి ఉన్నట్లు తహసీల్దార్ తెలిపారు. కార్డులతో పాటు 2041 ఇందిరమ్మ గహాలకు సంబంధించి 263 పింఛన్ల తొలగింపునకు నోటీసులు ఇచ్చినట్లు, వాటికి సంబంధించి ఇప్పటి వరకు రెండు వందలకు పైగా సమాధానాలు వచ్చినట్లు తెలిపారు
|
|
|
|
|
|
|