| ఖాకీల ఫైటింగ్ |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 5:16 [IST] |
 |
|
ఇరువురి మధ్య మాటా మాటా పెగిరి నువ్వెంత అంటే నువ్వెం త అంటూ వాదోపవాదాలకు దారితీసిం ది. చివరికి ఇన్‌స్పెక్టర్ మాధ్యూకోషి తన గదిలోకి వెళ్ళి పోవడంతో వివాదం సద్దుమణిగింది. కాగా, కానిస్టేబుల్, ఇన్‌స్పెక్టర్ ఒకరిపై ఒకరు దాడి చేసుకు నట్లు ఈ ఘనకార్యాన్ని చూసిన కొంద రు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
తనను కొంత కాలంగా ఇన్‌స్పెక్టర్ మాధ్యూకోష్ వేధిస్తున్నారని, తరచూ కులం పేరుతో దూషిస్తున్నాడంటూ కానిస్టేబుల్ సత్తయ్య ఆరోపిస్తున్నారు. ఇన్‌స్పెక్టర్ తనపై దాడి చేసి కొట్టారని చెబుతూ కంటిపై ఉన్న ఓ గాయాన్ని కానిస్టేబుల్ చూపించాడు. ఇదిలా ఉం డగా, తాను కానిస్టేబుల్‌పై దాడి చేయ లేదని అతనే తనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకున్నానని ఇన్‌స్పెక్టర్ మాధ్యూకోష్ వివరణ ఇచ్చుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం సిసిఎస్ పో లీసు సిబ్బంది ఎదుటే జరగటంతో వారు నివ్వెరపోయారు. పోలీసు ఉన్న తాధికారులు కిందిస్థాయి సిబ్బంది మ ధ్య ఉన్న సమన్వయం ఈ ఉదంతంతో వెలుగులోకి వచ్చినట్లయింది. ఒకరిపై ఒకరికి గౌరవం లేకుండా అందరి ముం దు బహిరంగంగా వాదులాడు కోవడం దాడులు చేసుకునే స్థాయిలో వెళ్ళితే ప్రజలకు ఏవిధంగా న్యాయం చేస్తారో వారికే తెలియాలని అనుకున్నారు.
|
|
|
|
|
|
|