| కంట్రిబ్యూటరీ విధానం రద్దు చేయాలి |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 5:15 [IST] |
 |
|
సుల్తాన్‌బజార్,మార్చి 11 ప్రభాతవార్త: డిఎస్సీ 2003 టీచర్లకు కాంట్రిబ్యూట రీ పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఎమర్జింగ్ టీచర్స్ అసోసియేషన్ గతం లో మానవ హక్కుల కమిషన్‌లో చేసిన ఫిర్యాదుపై కమిషన్‌లో విచార ణ నిర్వహించారు.విచారణ నిర్వహించి న కమిషన్ సభ్యులు ఇస్మాయిల్ ఈ కేసు తదుపరి విచారణను జూన్16వ తేదీకి వాయిదా వేశారు.విచారణకు హా జరైన ఎమర్జింగ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్‌బాబు,ప్రధాన కార్యదర్శి డ్యాన్ ఆర్నాల్డ్‌లు విలేక రులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2003 డిఎస్సీకి 16981 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు.ఏప్రిల్ 4,5,6 తేదీలలో పరీక్షలు నిర్వహించగా ఫిబ్రవరి 2005 లో ఫలితాలు ప్రకటించారన్నారు ఎన్నికైన వారి నియమాకాల కోసం ఎటువంటి న్యాయపరమైన ఆటంకాలు లేనప్పటికీ షెడ్యూల్ వాయిదా వేశారని వారు చెప్పారు.
ఫలితాలు విడుదల చేసిన అనంతరం జూలై మాసం లోపు పోస్టింగ్స్ ఇచ్చి ఉంటే కాట్రిబ్యూటరీ విధానం తమకు వర్తించేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.డిఎస్సీకి ఎన్నికైన 18 నెలల తర్వాత పోస్టింగ్స్ ఇచ్చి తమకు అన్యాయం చేసిన విషయంలో వి చారణ జరిపించి తమకు న్యాయం చే యాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ సుభాషణ్‌రెడ్డిని వారు కోరారు
|
|
|
|
|
|
|