|
సుల్తాన్‌బజార్, మార్చి 11 ప్రభాతవార్త: క్రమశిక్షణ నేర్పించవలసిన ఉపాధ్యా యులే క్రమశిక్షణ తప్పి ఓ విద్యార్ధిని అసభ్యపదజాలంతో దూషించిన సంఘ టనపై గురువారం రాష్ట్ర మాన వహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈసంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూర్‌జి ల్లాకు చెందిన సయ్యద్‌షమి కుమారు డు షమిహుస్సేన్ రామలింగాపురం బైపాస్‌రోడ్డులోని నారాయణ కాన్సెప్ట్ పాఠశాలలో చదువుతున్నాడు.రెండు నెలల క్రితం పాఠశాలలో ఉపాధ్యా యుడు రాము సదరు విద్యార్దిని యూనిఫాం సక్రమంగాలేదని,నాలుక మందంఉంది చదువు ఏట్లా వస్తుందని దుర్బాషలాడినట్లు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. హుస్సేన్‌తోపాటు మరో నలుగురు విద్యార్దులను గదిలో బంధిం చి కొట్టడడంతో తాను ప్రశ్నించగా ఉపాధ్యాయులు వేణు,నరేంద్రలు తమపై దాడి చేసినట్లు తెలిపారు. ఈవి షయమై నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా యాజ మాన్యం పోలీసులతో కుమ్మకై కేసును నీరుగార్చినట్లు తెలిపారు. తిరిగి తనపై అక్రమంగా కేసు నమోదు చేయిం చినట్లు వాపోయారు.పాఠశాలకు సరైన ఆటస్థలంలేదని, ఉదయం ఎనిమిది గంటలనుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు విద్యార్ధులకు చదువుపేరుతో నరకం చూపుతున్నట్లు ఆయన కమిష న్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు .ఈవిషయమై విచారణ జరిపించి పాఠశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కమిషన్ చైర్మన్ జస్టిస్ సుభాషిణ్‌రెడ్డిని కోరారు.
|