| .జామిలో ఐసిటిసి కేంద్రం ప్రారంభం |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 3:21 [IST] |
 |
|
|
జామి, మార్చి 11 ప్రభాతవార్త : మండల కేంద్రమైన జామిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐసిటిసి కేంద్రాన్ని గురువారం గ్రామ సర్పంచ్ అల్లు పద్మ ప్రారంభం చేశారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు, హెచ్‌ఐవి పరీక్షలు నిర్వహించేందుకు జిల్లాలో ఈ కేంద్రాలను నాలుగు చోట్ల కొత్తగా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా జామి పిహెచ్‌సిలో ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ సందర్భంగా గర్బిణీలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జడ్పీటీసీ పిడిది రామకృష్ణ హాజరయ్యారు. గర్బిణీలు తప్పనిసరిగా హెచ్‌ఐవి పరీక్షలు చేసుకోవాలని అన్నారు. జామిలో ఉచితంగా ఈ పరీక్షలు ఈ కేంద్రం ద్వారా జరుగుతాయన్నారు. వైద్యాధికారిణి కె.సత్యవేణి మాట్లాడుతూ ఎవరైనా అనుమానం ఉంటే తప్పక ఈ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎ.సూర్యనారాయణ డాక్టర్ భీమారావు పిహెచ్‌సి సిబ్బంది, ఆశవర్కర్లు, గర్బిణీలు పాల్గొన్నారు.
|
|
|
|
|
|
|