మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

Bharathmatrimony
లాగిన్ | రిజిస్టర్
ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తిరుమలగిరి సురేందర్‌
శుక్ర వారం, మార్చి 12, 2010 , 9:35 [IST]

surenderహైదరాబాద్‌, మార్చి11, ప్రభాతవార్త : నూతనంగా రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా నియుక్తులైన  తిరుమలగిరి సురేందర్‌ గురువారం పదవీబాధ్యత లను స్వీకరించారు. ఉదయం 11గంటలకు ఆయన వేద ఆశీర్వచనాలతో శాస్త్రీయ పద్ధతిలో బాధ్యత లను ప్రారంభించారు. ఇంతవరకు ఈ పదవిలో కొనసాగిన దేవులపల్లి అమర్‌ ఆయనకు బాధ్యత లను అప్పగించారు. పదవీప్రమాణం పూర్తికాగానే సురేందర్‌ ముందుగా, ఇష్టదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించి, వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి తనపైన నమ్మకంతో గురుతర బాధ్య తలను అప్పగించారని, శక్తివంచనలేకుండా పనిచే స్తానని, అకాడమిక్‌రంగంలో ప్రెస్‌అకాడమీకి మంచి పేరు తీసుకువస్తానని తన భవిష్యత్తు కార్యా చర ణను ఆయన ప్రకటించారు.తిరుమలగిరి గత నాలుగు దశాబ్దాలుగా జర్నలిజంలో విశేషంగా కృషి చేస్తూ వస్తున్నారు.

పత్రికారంగంలో ఆయన సాధించిన అపార అనుభవానికి తగిన గుర్తింపు లభించిందని జర్న లిజం నిపుణులు వ్యాఖ్యానించారు. సురేందర్‌ అభిమానులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, రాజకీయనాయకులు, మంత్రులు, జర్నలిజం సీనియర్లు, సమాచారశాఖ సీనియర్‌ అధికారులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి  హాజరయ్యారు. రాష్ట్ర సమాచార, టూరిజం శాఖామాత్యులు  డాక్టర్‌ జె.గీతారెడ్డి అందరికన్నా ముందుగా సరిగ్గా ముహూర్తసమయానికి విచ్చేసి నూతన ప్రెస్‌అకా డమీ చైర్మన్‌కు శుభాభినందనలందచేశారు.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 'ఓదార్పు' నిజాయితీని గుర్తించారు
 కష్టాలు అధిగమించడమే నా సక్సెస్
 సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
 ఒయులో అసలేం జరిగిందంటే
 జగన్‌కు సోనియా ఝలక్‌
 రాజకీయాలు పూల బాటకాదు, ముళ్లబాట..
 పోలీస్‌ చమత్కారం?
 డాక్టర్‌ గిరీష్‌ సంఘీకి సిఎం..
 పిహెచ్‌డి విద్యార్థులతో పాఠాలు
 కార్యదీక్ష, దృఢ సంకల్పం వైశ్యుల..
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com