| తెలుగు, కన్నడ భాషల ప్రాచీన హోదా అమలుకు నిధులు |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 9:14 [IST] |
 |
|
న్యూఢిల్లీ, మార్చి11, ప్రభాతవార్త: తమిళ, సంస్కృత భాషలతో సమానంగా తెలుగు, కన్నడ భాషల ప్రాచీన హోదా అమలుకు అవసరమైన నిధులు సమకూ ర్చుతామని కేంద్ర న్యాయశాఖమంత్రి వీరప్పమొయిలీ తనకు చెప్పినట్లు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు. ఈమేరకు ఆయన గురువారం పార్ల మెంటులో మొయిలీని కలిసి ఒక లేఖను అందజేశారు. ఇటీవల హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రి గీతారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎంపీలంతా సంతకాలు చేసిన పత్రాన్ని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కేంద్రమంత్రులు వీరప్ప మొయిలీలకు యార్లగడ్డ లేఖను అందజేశారు.
మద్రాస్ హైకోర్టు కేసుతో సంబం ధం లేకుండా త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తామని మొయిలీ తనతో చెప్పారని యార్లగడ్డ పేర్కొన్నారు.తమిళ, సంస్కృత భాషలకు ఇచ్చిన విధంగానే నిధుల, ఇతర సౌకర్యాలను కేంద్రం తెలుగు, కన్నడ భాషలకు కూడా ఇస్తుందని, ఈ అంశంపై కేంద్ర మాననవనరుల శాఖతో కూడా తాను మాట్లాడతానిన మొయిలీ హామీ ఇచ్చిరని చెప్పారు.
|
|
|
|
|
|
|