| 17నుంచి సంఘీ రథయాత్ర మళ్లీ షురూ |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 9:12 [IST] |
 |
|
పాట్నా, మార్చి 11: రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్ డాక్టర్ గిరీష్‌కుమార్ సంఘీ నేతృత్వంలో చేపట్టిన బీహార్ పరివర్తన చేతనయాత్ర రెండవ దశ ఈనెల 17న ప్రారంభం కానుంది. యాత్ర ముగింపు సందర్భంగా పాట్నా లోని గాంధీమైదాన్‌లో భారీ బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు. అందులో పార్టీ అధినేత్రి సోని యాగాంధీ, యువనేత రాహుల్‌గాంధీలు ప్రసంగి స్తారు. బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ సర్కారు ఏర్పాటే లక్ష్యంగా డాక్టర్ సంఘీ రథయాత్ర చేపట్టిన విష యం తెలిసిందే. మొదటిదశ యాత్ర గురువారం ముగిసింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్య క్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ జగదీష్ టైట్లర్ మాట్లాడుతూ, ఈ దఫా రాష్ట్రఎన్నికల్లో పార్టీ విజయం ఖాయమని, దీన్ని అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదని పేర్కొన్నారు. ప్రజలంతా మార్పు కోరుతు న్నట్లు మొదటిదశ యాత్ర సందర్భంగా స్పష్టమైం దని చెప్పారు. ఇంతకాలం లాలూ, నితీష్‌కుమార్‌లు తమను మోసగించారన్న విషయం వారు తెలుసు కున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎన్ని నిధులు కేటాయిస్తున్నా అవి లబ్దిదారులకు చేరడం లేదని ఖయన ఆరోపించారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అనిల్‌శర్మ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు ఘోరపరాజయం చవిచూడడం ఖాయమని పేర్కొన్నారు. లాలూ, రబ్రీల జంగల్‌రా జ్‌ను అంతమొందిస్తాననే నినాదంతో వచ్చిన నితీష్ కుమార్ ప్రజలఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకో వడంలో ఘోరంగా విఫలమయ్యారని, లాలూ, నితీ ష్‌లు దొందూ దొందేనని, వారు కనీసం కేంద్ర పథ కాలనుసైతం సరిగా అమలు చేయలేకపోయారని విమర్శించారు.
కులం, మతం పేరుతో జరుగు తున్న రాజకీయాలకు తెరదించే సమయం ఆసన్న మైందన్నారు.మాజీఎంపి విజయ్ సింహ్,డాక్టర్ అశో క్‌చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగిం చారు. ఈ కార్యక్రమానికి ముందు జగదీష్ టైట్లర్, సంఘీ సుమారు గంట సేపు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో పార్టీ పరిస్థితితోపాటు మహిళా బిల్లు ఆమోదంపై సుదీర్ఘంగా చర్చించారు. రధయాత్రకు ప్రజలనుంచిఅపూర్వస్పందన లభిస్తుం డడం పట్ల టైట్లర్ సంఘీని అభినందించారు.
|
|
|
|
|
|
|