మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
మహిళా బిల్లుపై బిజెపిలో అసమ్మతి
శుక్ర వారం, మార్చి 12, 2010 , 9:10 [IST]

bjp leadersసీట్లు పోతాయేమోనని పురుష ఎంపీల బెంగ
అసమ్మతీయులను బుజ్జగించడానికి రంగంలోకి దిగిన అగ్రనాయకత్వం
పార్టీ ఎంపీలకు విప్‌ జారీకి నిర్ణయం
న్యూఢిల్లీ, మార్చి 11:
మహిళా బిల్లుకు లోక్‌సభలోని బిజెపి ఎంపీల్లో ఓ వర్గం తమ వ్యతిరేకతను వ్యక్తం చేసి, బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేస్తామని హెచ్చరిం చడంతో అసమ్మతీయుల అస్త్రాన్ని వారిపైనే ప్రయో గించడానికి విప్‌ జారీచేయడంద్వారావారిని అదుపు చేయాలని పార్టీ నిర్ణయించింది. బిజెపి అగ్ర నాయ కత్వం నష్టనియంత్రణ చర్యల్లో తలమునకలై, పార్టీ పంధాకుఅనుగుణంగా పార్టీఎంపీలతో ఓటు వేయిం చడానికి వారికి విప్‌జారీ చేయాలని నిర్ణయించింది. పార్టీలో తిరుగుబాటు తలెత్తుతుందన్న భయంతో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీ,పార్టీ మాజీ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌ సహా పార్టీ అగ్రనా యకులు గురువారం ఉదయం అసమ్మతి ఎంపీ లతో సమావేశమయ్యారు.

బిల్లుపై వారిలో ఏర్ప డిన భయాందోళనలను పోగొట్టడానికి ప్రయత్నిం చారు.లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడింట ఒకవంతు స్థానాలను రిజర్వ్‌ చేయడానికి ఉద్దేశించిన బిల్లువల్ల చాలామంది పురు షులు తమ స్థానాలను కోల్పోవాల్సివస్తుందని అసమ్మతీయులు భయపడుతున్నారు. బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రముఖుల్లో యోగి ఆది త్యనాధ్‌ (గోరక్‌పూర్‌ ఎంపీ), కేంద్ర  మాజీ మంత్రి హుకుందేవ్‌ నారాయణ్‌ యాదవ్‌, జనతాదళ్‌ పరివార్‌కు చెందిన పాత సోషలిస్టు, లోక్‌సభలో పార్టీ చీఫ్‌విప్‌ రమేష్‌బైస్‌ ఉన్నారు. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టినపుడు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని కొంతమంది పార్టీ ఎంపీలు బెదిరించినట్లు చెబుతున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడానికి లోక్‌సభలో 116మంది సభ్యులుగల బిజెపి మద్దతు కీలకం కానుంది.

ధరల పెరుగుదల, అంతర్గత భద్రత అంశాలపై  ప్రభుత్వంపై దాడి జరపాలన్న బిజెపి ఎజెండా నుంచి దృష్టి మళ్లించడానికే కాంగ్రెస్‌ వ్యూహంలో భాగంగానే మహిళా బిల్లును తీసుకువచ్చారని ఎంపీ యోగి ఆదిత్యనాధ్‌ పార్టీని హెచ్చరించారు. బిల్లుకు వ్యతిరేకంగా ఆయన ఇంతకుముందే తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈవిషయమై  జోషీ, రాజ్‌నాధ్‌ వంటి సీనియర్‌ నాయకులు నచ్చజెప్పిన మీదట చివరకు ఆయన పార్టీ పంధాకు అనుగుణంగా మారే అవకాశముంది. ఇదిలాఉండగా, ప్రభుత్వం తొలుత ఆర్ధిక బిల్లులను ఆమోదించుకోవాలనుకుంటున్నందున, మహిళా బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టదని కూడా పార్టీలోని కొంతమంది యోధులు ఆశాభావంతో ఉన్నారు.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 వైశ్యులంతా ఓటుహక్కును..
 కొందరు కాంగ్రెస్‌సీనియర్ల..
 తారలు దిగివచ్చిన వేళ...
 కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
 పోలీసు వ్యవస్థలో మార్పులు రావాలి:..
 జగన్‌ ఓదార్పుపై ప్రధాని పిలుపుతో..
 కాశ్మీర్‌లో అన్నివర్గాలతో..
 ఇసి కొత్త కమిషనర్‌గా ఎపి కేడర్‌..
 చట్టసభల్లో రిజర్వేషన్లకోసం..
 అక్రమమైనింగ్‌పై లోక్‌సభలో టిడిపి..
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com