| 18న శ్రీకృష్ణ కమిటీ సమావేశం |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 9:08 [IST] |
 |
|
లగడపాటి మూడో లేఖ న్యూఢిల్లీ, మార్చి11, ప్రభాతవార్త : ఈ నెల 18వ తేదీన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ హస్తినలో సమావేశం కానున్నది. హైదరాబాద్ పర్యటనలోని అంశాలపై, వివిధ పార్టీలనేతలు అందించిన సమాచారంలో సమీక్షను నిర్వహించనున్నుది.అలాగే ఇప్పటివరకు తమ కార్యా లయానికి వచ్చిన సమాచారాన్నికూడా సభ్యులు పరిశీలించనున్నారు. ఇప్పటివరకు కమి టీకి అత్యధికమైనసమాచారం అందించినవారిలో విజయవాడఎంపీ లగడపాటి రాజగోపాల్ ముందంజలో ఉన్నారు. మూడు విడతలుగా ఇప్పటివరకు 200పేజీలకు పైగా విలువైన సమాచారాన్ని కమిటీకి అందజేశారు.
కేంద్రం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ సంప్రదింపుల కమిటీకి విజయవాడ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ తన మూడో లేఖను సమర్పించారు.బుధవారం హస్తినలో మాజీ శాసనసభ్యులు అడుసుమిల్లి జయప్రకాష్ ద్వారా సుమారు 30పేజీల లేఖను కమిటీ సభ్యుడు దుగ్గల్ కార్యాలయానికి పంపారు. రాష్ట్రం సమైఖ్యంగా ఉండటానికి అవసరమైన చారిత్రాత్మక అవసరం, శాస్త్రీయ కారణాలను లేఖలో పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా 12 అంశాలు చోటుచేసుకున్నాయి.
తెలుగువారి సమైఖ్యతా - రాష్ట్ర విచ్చిన్నత వల్ల జరిగే నష్టాలు, దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా లక్షకోట్ల పైచిలుకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విధానం. రాష్ట్రం విడిపోతే నదీజలాలు వివాదమయ్యే అవకాశం ఏ విధంగా ఉందో పేర్కొన్నారు.విద్యుత్ తయారీ, విభజన సమస్యలు, రాజధానుల నిర్మాణానికి భారీ వ్యయం. హైద రాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు జరగబోయే నష్టాలు, ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో పారిశ్రామిక అభివృద్ధిలో లోటు.రాజకీయఅనిశ్చిత, మరిన్ని ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం, రాష్ట్ర విభజనవల్ల ఆయాప్రాంతాల్లో ఐఎస్‌ఐ, మాఫియా, మావో యిస్టుల కార్యకలాపాలు ఏ విధంగా ఉదృతమవుతాయో కమిటీకి తెలిపారు.
కులమత విభేధాలు ప్రచ్చరిల్లే అవకాశం ఉందన్నారు. వ్యాపార, పారిశ్రామిక అభివృద్ది, ఉద్యోగ అవకాశాల క్షీణత, రాష్ట్ర రెవెన్యూలో లోటు తద్వారా సంక్షేమ అభివృద్ది రంగాల్లో నష్టాలను వివరించారు. తెలంగాణపై మాజీ ప్రధానమంత్రుల అభిప్రాయా లను పొందుపర్చారు.నిజామాబాద్‌లో పండిట్ జవహర్‌లాల్‌నెహ్రు ప్రసంగం, ఆరుసూత్రాల పథకం పై మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రసంగాన్ని కూడా కమిటీకి అందజేశారు.
|
|
|
|
|
|
|