| ఏడుగురు రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేత |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 9:06 [IST] |
 |
|
న్యూఢిల్లీ, మార్చి 11 : సభా కార్యక్రమాలకు అంతరా యం కలిగించి, చైర్మన్ స్థానాన్ని అగౌరవపరిచినం దుకు మంగళవారం రాజ్యసభ నుంచి సస్పెండ యిన ఏడుగురు సభ్యులపై గురువారం సస్పెన్షన్ ఎత్తివేశారు. సస్పెన్షన్ ఎత్తివేసిన సభ్యుల్లో సుభాష్ యాదవ్ (ఆర్‌జెడి), సబీర్ అలీ (ఎల్‌జెపి) వీర్‌పాల్ సింగ్‌యాదవ్, నందకిషోర్‌యాదవ్, అమీర్ అలం ఖాన్, కమల్ అఖ్తర్ (అందరూ ఎస్‌పి), ఎజజ్ అలీ (ఏ పార్టీకి చెందని సభ్యుడు) ఉన్నారు.అంతకు ముందు ఏడుగురు సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివే యాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో బిజెపి, అన్నా డిఎంకె, వామపక్షాలు ఒక్కటయ్యాయి. అయితే సస్పెన్షన్ ఎత్తివేతకు ముందు సంబంధిత సభ్యులు చైర్మన్‌ను అగౌరవపరిచినందుకు విచారం వ్యక్తం చేయాలని పాలకపక్ష సభ్యులు పట్టుబ ట్టారు.
ఈ విషయమై ఏకమైన ప్రతిపక్షాలు ప్రశ్నో త్తరాల సమయానికి అంతరాయం కలిగించడంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. రాజ్యసభ సమావేశం కాగానే, మంగళవారం రాజ్యసభలో రాజ్యాంగ సవరణ బిల్లు (మహిళా రిజర్వేషన్ బిల్లు) ను ప్రవేశపెట్టినపుడు కొంతమంది సభ్యులు ప్రవ ర్తించిన తీరుకు చైర్మన్ హమీద్ అన్సారీకి ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీ విచారం వెలిబుచ్చారు. సస్పెండయిన సభ్యులతోపాటు సభా కార్యక్రమా లకు దూరంగా ఉన్న సమాజ్‌వాది పార్టీ, ఆర్‌జెడి సభ్యులను కూడా సభలోకి పిలవాలని ఆయన కోరారు.ఆయనకు శివసేన, అన్నా డిఎంకె సభ్యు లు మద్దతు పలికారు.
లోక్‌సభలో... పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్‌కుమార్ బన్సల్ లోక్‌సభలో ఇచ్చిన హామీ మేరకు రాజ్య సభలో ఏడుగురు సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. తమ సభ్యులను ఎగువసభకు దూరంగా ఉంచడంపై ఆర్‌జెడి సభ్యుడు రఘువంశ్‌ప్రసాద్ సింగ్ లోక్‌సభలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ''రాజ్యసభ నుంచి గెంటివేయబడిన ఏడుగురు సభ్యుల సంగతేంటి? అని సింగ్ ప్రశ్నించింది. లోక్‌సభలో సభా కార్యక్రమాలు సజావుగా సాగడా నికి ఒప్పందం కుదిరినట్లు సభానాయకుడు ప్రణబ్ ముఖర్జీ ప్రకటించిన వెంటనే సభలో ప్రభుత్వాన్ని సింగ్ నిలదీశారు.
వారు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు అని శైలేంద్రకుమార్(ఎస్‌పి) ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశం సస్పెండయిన సభ్యులకు, ప్రభుత్వానికి మధ్య చర్చ ల్లో ఉన్నదని బన్సల్ లోక్‌సభకు హామీ ఇచ్చారు. అంతకు ముందు ఇదే అంశం పై రాజ్యసభలో ఆందోళన చేస్తున్న సభ్యులు ప్రశ్నోత్తరాల సమయానికి అంతరాయం కలిగించారు.
|
|
|
|
|
|
|