| అందరితో సంప్రదించాకే |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 9:05 [IST] |
 |
|
న్యూఢిల్లీ, మార్చి 11 : అన్ని వర్గాలతో సంప్రదిం పులు జరిపిన తర్వాతే లోక్‌సభలో మహిళా బిల్లును ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటిం చింది.దీనితో లోక్‌సభలో ప్రతిపాదిత బిల్లు ప్రవే శపెట్టడంపై ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడింది. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎస్‌పి అధ్య క్షుడు ములాయంసింగ్ యాదవ్, ఆర్‌జెడి అధ్య క్షుడు లాలూప్రసాద్, జెడియు అధ్యక్షుడు శరద్ యాదవ్ గురువారం ఆర్ధికమంత్రి ప్రణబ్ ముఖ ర్జీని కలుసుకోవడంతో ప్రతిష్టంభన తొలగిపో యింది. సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌పవార్, డిఎంకె నాయకుడు టి.ఆర్.బాలు కూడాపాల్గొన్నారు.
రాజ్యాంగసవరణబిల్లు(మహిళా రిజర్వేషన్‌బిల్లు)నులోక్‌సభలోప్రవేశపెట్టే ముందు బిల్లు పురోగతిపై తమకు కొన్ని హామీలు కావా లని సమావేశంలో కోరారని, ప్రభుత్వం సంబం ధిత పార్టీలతో సంప్రదింపుల ప్రక్రియను పూర్తి చేస్తుంది అని ముఖర్జీ తన చర్చల తర్వాత లోక్ సభలోచేసిన ప్రకటనలోపేర్కొన్నారు. ''ఈ హామీ వల్ల సభ్యులందరి మనోభావాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని, సభా వ్యవహారాలు సజావుగాసాగుతాయనిభావిస్తున్నా అని ఆయన అన్నారు. అంతకుముందు సభ రెండుసార్లు వాయిదాపడింది.
బిల్లును వ్యతిరేకిస్తున్న సభ్యులు గత నాలుగు రోజులుగా లోక్‌సభలోసభాకార్యక్రమాలకు అంత రాయం కలిగిస్తుండటంతో సాధారణ కార్యకలా పాలునిలిచిపోయాయి. ''మిగతా సభాకాలం సజా వుగా నిర్వహించడానికి అంగీకారం కుదిరిందని సభ్యులకుతెలియజేస్తున్నా అనిముఖర్జీ అన్నారు. మహిళా బిల్లుపై గందరగోళం ఏర్పడటంతో రెం డుసార్లు సభ వాయిదా పడిన తర్వాత మధ్యా హ్నం రెండుగంటలకు సభానాయకుడు ఈ ప్రక టన చేశారు. వెంటనే సభలో సాధారణ పరిస్థితి ఏర్పడి, సాధారణ బడ్జెట్‌పై చర్చను మొదలుపె ట్టారు. లోక్‌సభలో మహిళా బిల్లును ప్రవేశపెట్టే ముందు సభలోని అన్నివర్గాలతో సంప్రదింపులు జరుపుతామని ప్రభుత్వం బిల్లు వ్యతిరేకులకు హామీ ఇచ్చిందని అంతకుముందు ముఖర్జీతో సమావేశం తర్వాత శరద్‌యాదవ్ చెప్పారు.
|
|
|
|
|
|
|