| టాంజరిన్ స్పా అండ్ సెలూన్ ప్రారంభం |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 8:45 [IST] |
 |
|
హైదరాబాద్, మార్చి 11, బిజినెస్ బ్యూరో: హెల్త్‌క్లబ్ రంగంలో అగ్రగామిగా ఉన్న టాంజ రిన్ స్పా అండ్ సెలూన్ గతంలో ప్రారంభించి నప్పటికి ఇటీవల మళ్ళీ దీనిని ఆధునీక రించారు. ఈ సందర్బంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ కొనేరు మాట్లాడుతూ ఇటీవల కాలంలో పట్టణాలలో తమ ఆరోగ్య రక్షణకు ఎంతో విలువ ఇస్తున్నట్లు, మా కంపెనీకి పెరిగే కస్టమర్లను పెరిగిపోడానికి ఇదే కారణమని చెప్పారు. ఇటీవల కంపెనీ స్పా అకాడమీ ద్వారా డిప్లమా కోర్సును ప్రవేశపెట్టింది. ఈ డిప్లమా కోర్సు మూడు నుంచి ఆరు నెలల పాటు ఉంటుందన్నారు. ఒక్కొక్క బ్యాచ్‌లో 12 నుంచి 15 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.
దీని కోసం ఫీజు కింద రూ.40వేల నుంచి 80వేల వరకు వసూలు చేయనున్నట్లు చెప్పారు. ఇటీవల కాలంలో ఈ రంగంలో నిపుణలు కొరత చాలా ఉందని, దీనికోసం విదేశాల నుంచి నిపుణుల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కంపెనీ థల్లసోధెరిపి, వినోథెెరపి అనే కొత్త చికిత్సలు అందుబాటులోకి తీసుకవచ్చింది. అమెరికాకు చెందిన డెర్మటాలజికతో కలిసి టాంజరిన్ పనిచేస్తుంది.
|
|
|
|
|
|
|