| మార్కెట్లోకి ఫోక్స్‌వ్యాగన్ 'పోలో కారు' |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 8:44 [IST] |
 |
|
హైదరాబాద్, మార్చి 11, బిజినెస్ బ్యూరో: ఫోక్స్‌వ్యాగన్ నుంచి రాష్ట్ర మార్కెట్లోకి 'పోలో కారును విడుదల చేసింది. ఈ సందర్బంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సంగ్వీ మాట్లాడుతూ కంపెనీ మార్కెట్లోకి విడుదలవుతున్న చిన్నకార్లలో ఇది ఒకటని అన్నారు. గడిచిన నాలుగు రోజులలో ఇప్పటి వరకు 100 కార్లు బుక్కింగ్ జరిగాయని చెప్పారు.అలాగే ఈ కారు పెట్రోల్, డీజిల్ వెర్షన్‌లలో లభ్యం కానున్నది. 1.2లీటర్ ఇంజన్ సామర్థ్యంతో పెట్రోల్, డీజిల్ వెర్షన్‌లలో లభ్యం కానున్నది.ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్ వెర్షన్ లభ్యం అవుతున్నది.
మే నెలలో డీజిల్ వెర్షన్ లభ్యం కాగలదని ఆయన వివరించారు. ఈ కార్లు ఆరు రంగుల్లో లభ్యం అవుతాయి.ఈ సందర్బంగా మొదటి డెలివరీగా ఎండి.బషీర్‌కు కారు తాళం చెవిని అందచేశారు. పెట్రోల్ కారు లీటర్‌కు 17 కిలోమీటర్ల మైలేజి ఇవ్వనున్నది. డీజిల్ కారు కూడా మైలేజి బాగానే ఇవ్వనున్నట్లు చెప్పారు. వీటి ధరలు హైదరాబాద్ షోరూంలో రూ.4.50 లక్షల నుంచి రూ.5.52లక్షల వరకు లభ్యమవుతాయి.
|
|
|
|
|
|
|