Home » వాణిజ్యం » వాటాల విక్రయానికి బిఎస్‌ఎన్‌ఎల్ నిర్ణయం
వాటాల విక్రయానికి బిఎస్‌ఎన్‌ఎల్ నిర్ణయం
శుక్ర వారం, మార్చి 12, 2010 , 8:42 [IST]
మార్చి 15న ఆందోళనకు సిబ్బంది సంఘాలు సిద్ధం న్యూఢిల్లీ మార్చి 11:- బిఎస్‌ఎన్‌ఎల్‌లో 30 శాతం వాటాలను డిజిన్వెస్ట్ చేయాలని లక్ష మంది సిబ్బందికి స్వచ్ఛంధ పదవివిరమణకు అవకాశం కల్పించాలని శామ్‌పిట్రోడ పానెల్ ఇచ్చిన నివేదికను బిఎస్‌ఎన్‌ఎల్ బోర్డు ఆమోదించడంతో సిబ్బంది సంఘాలు ఆగ్రహం తో ఉన్నాయి. బోర్డు నిర్ణయంపై తాము దేశవ్యాప్తంగా ఆందోళన ప్రారంభిస్తామని ఎక్జిక్యూటివ్‌లు, నాన్ ఎక్జిక్యూటివ్‌ల ఫోరమ్ కన్వీనర్ విఎమ్ నంబూద్రి పేర్కొన్నారు. మార్చి 15న ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థల కార్యాలయాల వద్ద సిబ్బంది ప్రదర్శనలు నిర్వహి స్తారు. మార్చి 15న సిబ్బంది సంఘా లు సమావేశం అయి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తాయి.
అ యితే తమ ఆందోళనల వల్ల టెలికామ్ సర్వీసులు దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేసిన శామ్‌పిట్రోడ పానెల్ 30 శాతం ప్రభుత్వ వాటాలను విక్రయించాలని, మూడో వంతు సిబ్బందిని తగ్గించాలని సిఫారసు చేసింది. బిఎస్‌ఎన్‌ఎల్‌లో మూడు లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 2007-08లో బిఎస్‌ఎన్‌ఎల్‌కు పదివేల కోట్లు లాభాలు ఉండగా 2008-09 సంవత్సరానికి అవి రూ.570 కోట్లకు తగ్గిపోయాయి. కొత్తగా ఈ రంగంలో ప్రవేశించిన కంపెనీల పోటీని తట్టుకోలేక మార్కెట్ వాటాను బిఎస్‌ఎన్‌ఎల్ కోల్పోతున్నది.జిఎస్‌ఎమ్ మొబైల్ నెట్‌వర్క్‌ను విస్తృతపరిచేందుకు 93 మిలియన్ లైన్‌ల నెట్‌వర్క్ 35వేల కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసే ప్రతిపాదనను ఉపసంహరించాలని కూడా శామ్‌పిట్రోడ పానెల్ కోరింది.
బిఎస్‌ఎన్‌ఎల్‌లో ఎక్జిక్యూటివ్‌లకు నాన్‌ఎక్జిక్యూ టివ్‌లకు 15 సంఘాలు ఉన్నాయి. ఈ సిబ్బంది సంఘాలు ప్రధాని మన్మోహన్ సింగ్‌ను, టెలికామ్ శాఖ మంత్రి ఏ రాజాను కలుసుకోవడానికి ప్రయత్నిస్తాయని నంబూద్రి చెప్పారు. శామ్ పిట్రోడ పానెల్‌లో టెలికామ్ కార్యదర్శి పిజె థామస్, ప్రముఖ బ్యాంకర్ దీపక్ పరేఖ్ కూడా ఉన్నారు. ప్రయివేటు టెలికామ్ కంపెనీలు తమ లాభాలను దించుకుంటున్న తరుణంలో బిఎస్‌ఎన్‌ఎల్ తన మార్కెట్ వాటా కోల్పోతు న్నది. ప్రస్తుతం ఉన్న కెపాసిటీకి సరిపడ బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులను సంపాదించ గలిగింది. 93 మిలియన్ లైన్ల జిఎస్‌ఎమ్ టెండర్ రద్దు చేస్తే కొత్త వినియోగదారులను చేర్చుకునే అవకాశం బిఎస్‌ఎన్‌ఎల్‌కు పోతుంది. ప్రతి సంవత్సరం బిఎస్‌ఎన్‌ఎల్ నుంచి పదివేల మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారని, కొత్త సిబ్బందిని చేర్చుకోవడం లేదని దీనివల్ల స్వచ్ఛంధ పదవివిరమణ అవసరం లేదని నంబూద్రి అంటున్నారు.