న్యూయార్క్ మార్చి 11:- ప్రపంచంలో అతిసంపన్నుడైన వ్యక్తిగా మెక్సికన్ కోటీశ్వరుడు కార్లెస్‌స్లిమ్ ఎంపికయ్యారు. ఆయన ఆస్తుల విలువ 53.5 బిలియన్ డాలర్లు ఉన్నట్లు అంచనా. భారతీయ పారిశ్రామికుడు ముఖేష్ అంబానీ అంతర్జాతీయ కుబేరుల జాబితాలో 29 బిలియన్ డాలర్ల ఆస్తులతో నాలుగో స్థానంలో ఉన్నారు. అమెరికా మాగజీన్ ఫోర్బ్స్ ఈ జాబితాను విడుదల చేసింది. బిల్‌గేట్స్ 53 బిలియన్ డాలర్లతో రెండు స్థానంలోనూ, వారెన్ బఫెట్ 47 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. ప్రవాస భారతీయ పారిశ్రామికుడు లక్ష్మీమిట్టల్ ఆస్తుల విలువ 28.7 బిలియన్ డాలర్లు. ఆయన ముఖేష్ అంబానీ తర్వాత ఐదో స్థానంలో ఉన్నారు.
అనిల్ అంబానీ 13.7 బిలి యన్ డాలర్లతో 36వ స్థానంలో సరిపెట్టు కోవాల్సి వచ్చింది. సంవత్సరం క్రితం ప్రపంచ వ్యాప్తంగా 793 మంది బిలియనీర్లు ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య 1011కు పెరిగింది. గత 15 సంవత్సరాల్లో బిల్‌గేట్స్ 14 సంవత్సరాలు అగ్రస్థానంలో ఉన్నారు. గత సంవత్సరం కంటే ఆయన సంపద 13 బిలియన్ డాలర్లు పెరిగినప్పటికీ మొత్తం 53 బిలియన్ డాలర్లతో ఆయన రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రపంచ కుబేరుల్లో టాప్‌టెన్‌లో ఇద్దరు భారతీయులు ఉండటం విశేషం. ఈ టాప్‌టెన్ జాబితాలో ఒక మహిళ కూడా స్థానం సంపాదించారు. కార్ల్‌అల్‌బ్రెక్క్‌ట్ అనే ఈమె అల్డీ సూపర్ మార్కెట్ ఛెయిన్‌ను నిర్వహిస్తున్నది. ఆమె నికర ఆస్తుల విలువ 23.5 బిలియన్ డాలర్లు.
అమెరికాలో 403 బిలియనీర్లు ఉంటే తర్వాతి స్థానంలో చైనా, రష్యాలు ఉన్నాయి. ఇండియా కంటే చైనాలో బిలియనీర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఆసియాలోని 25 మంది కుబేరుల్లో భారతీయులు పది మంది ఉన్నారు.చైనాకు చెందిన వారు ఒకళ్లు మాత్రమే ఉన్నారు.హాంకాంగ్‌కు చెందిన వారు ఐదుగురు, జపాన్‌కు చెందిన వారు ఐదుగురు, చైనాకు చెందిన వారు ఒక్కరు ఉన్నారు. ప్రపంచంలో అన్ని నగరాల్లో కంటే ఎక్కువగా న్యూయార్క్‌లో బిలియనీర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ కుబేరుల్లో అతిపిన్సవయస్కుడు 25 సంవత్సరాల మార్క్‌జుగర్‌బెర్గ్. అతను ఫేస్ బుక్‌ను సృష్టించాడు.
భారతీయ కుబేరుల్లో ముఖేష్ అంబానీ, ఎల్‌ఎన్ మిట్టల్ ప్రపంచంలోనే టాప్‌టెన్‌లో ఉంటే ఈ జాబితాలో మరికొందరు కూడా స్థానం సంపాదించారు.అజీమ్ ప్రేమ్‌జీ (17 బిలియన్ డాలర్లు), అనిల్ అంబానీ (13.7 బిలియన్ డాలర్లు), శశిఅండ్ రవి రూయా (13 బిలియన్ డాలర్లు), సావిత్రి జిందాల్ (12.2 బిలియన్ డాలర్లు), కుషాల్‌పాల్ సింగ్( తొమ్మిది బిలియన్ డాలర్లు) కుమార్ బిర్లా (7.9 బిలియన్ డాలర్లు), సునిల్ మిట్టల్ (7.8 బిలియన్ డాలర్లు) అనిల్ అగర్వాల్ (6.4 బిలియన్ డాలర్లు) ఉన్నారు.
ప్రపంచంలో 25 మంది కుబేరులు ర్యాంక్ పేరు నెట్‌వర్త్ 1 కార్లోస్ స్లిమ్‌హెలు 53.5 బిలియన్ డాలర్లు (మెక్సికో) 2. బిల్‌గేట్స్ (యుఎస్) 53 బిలియన్ డాలర్లు 3. వారెన్ బఫెట్ (యుఎస్) 47 బిలియన్ డాలర్లు 4. ముఖేష్ అంబానీ (ఇండియా) 29 బిలియన్ డాలర్లు 5. లక్ష్మిమిట్టల్ (ఇండియా) 28.7 బిలియన్ డాలర్లు 6. లారెన్స్ ఎల్లిసన్ (యుఎస్) 28 బిలియన్ డాలర్లు 7. బెర్నర్డ్ ఆర్లనట్ (ఫ్రాన్స్) 27.5 బిలియన్ డాలర్లు 8. ఐక్ బటిస్టా (బ్రెజిల్) 27 బిలియన్ డాలర్లు 9. అమాన్‌షియో ఓర్‌టేగా (స్పెయిన్)25 బిలియన్ డాలర్లు 10. కార్ల్ ఆల్‌బర్చ్ (జర్మనీ) 23.5 బిలియన్ డాలర్లు 11. ఇంగ్‌వార్‌కమ్‌ప్రద్ (స్వీడన్) 23 బిలియన్ డాలర్లు 12. క్రిస్టివాల్టన్ (యుఎస్) 22.5 బిలియన్ డాలర్లు 13. స్టెఫన్ పర్‌స్సన్ (స్వీడన్) 22.4 బిలియన్ డాలర్లు 14. లికా షింగ్ (హాంకాంగ్) 21 బిలియన్ డాలర్లు 15. జిమ్ వాల్టన్ (యుఎస్) 20.7బిలియన్ డాలర్లు 16. అలైస్ వాల్టన్ 20.6 బిలియన్ డాలర్లు 17. లిథెన్‌బెటెన్‌కోర్ట్ (ఫ్రాన్స్) 20 బిలియన్ డాలర్లు 18. ఎస్ రాబ్సన్ వాల్టన్ (యుఎస్) 19.8 బిలియన్ డాలర్లు 19. ప్రిన్స్‌అల్వాలీద్ బిన్‌తాలా (సౌదీ)19.4 బిలియన్ డాలర్లు 20. డావిడ్ థామస్ (కెనడా) 19 బిలియన్ డాలర్లు 21. మైకెల్ ఒట్టో (జర్మనీ) 18.7బిలియన్ డాలర్లు 22. లీ షూకీ (హాంకాంగ్) 18.5బిలియన్ డాలర్లు 23. మైకెల్ బ్లూమ్‌బర్గ్ (యుఎస్) 18బిలియన్ డాలర్లు 24. సర్జిబ్రిన్ (యుఎస్) 17.5బిలియన్ డాలర్లు 25. చార్లెస్ కోచ్ (యుఎస్) 17.5బిలియన్ డాలర్లు
భారతీయ కుబేరుల జాబితా- టాప్ 25 4 (1) ముఖేష్ అంబానీ 29.0బిలియన్ డాలర్లు 5 (2) లక్ష్మి మిట్టల్ 28.7బిలియన్ డాలర్లు 28(3) అజీమ్ ప్రేమ్‌జీ 17.0బిలియన్ డాలర్లు 36(4) అనిల్ అంబానీ 13.7బిలియన్ డాలర్లు 40(5) శశిఅండ్ రవిరూయా 13 బిలియన్ డాలర్లు 44(6) సావిత్రి జిందాల్ 12.2బిలియన్ డాలర్లు 74(7) కెపి సింగ్ 9.0బిలియన్ డాలర్లు 86(8) కుమార్ బిర్లా 7.9బిలియన్ డాలర్లు 87(9) సునిల్ మిట్టల్ 7.8బిలియన్ డాలర్లు 113(10) అనిల్ అగర్వాల్ 6.4బిలియన్ డాలర్లు 148(11) ఆది గోద్రెజ్ అండ్ ఫ్యామిలి 5.2బిలియన్ డాలర్లు 167(12) గౌతమ్ అదాని 4.8బిలియన్ డాలర్లు 173(13) దిలిప్ సంఘ్వీ 4.6బిలియన్ డాలర్లు 201(14) శివ్‌నాడర్ 4.2బిలియన్ డాలర్లు 297(15) జిఎమ్ రావు 3.2బిలియన్ డాలర్లు 297(16) మల్విందర్ అండ్ శివిందర్ సింగ్ 3.2బిలియన్ డాలర్లు 316(17) ఉదయ్ కోటక్ 3.0బిలియన్ డాలర్లు 342(18) కళానిధి మారన్ 2.9బిలియన్ డాలర్లు 354(19) సుభాష్‌చంద్రా 2.8బిలియన్ డాలర్లు 354(20) మిక్కిజగ్‌తియాని 2.8బిలియన్ డాలర్లు 354(21) ఇంద్‌జైన్ 2.8బిలియన్ డాలర్లు 463(22) సుధీర్ అండ్ సమీర్‌మెహతా 2.1బిలియన్ డాలర్లు 488(23)యూసఫ్ హమిద్ 2.0బిలియన్‌డాలర్లు 488(24) సైరస్ పూనావాలా 2.0బిలియన్ డాలర్లు 488(25) రాజన్ రహేజా 2.0బిలియన్ డాలర్లు