| అస్సాం గ్యాస్కు కాగ్ అక్షింతలు |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 8:36 [IST] |
 |
|
దౌహతి మార్చి 11:- అస్సాం గ్యాస్ కంపెనీ లిమిటెడ్ తన వద్ద ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న ప్పటికీ అధిక వడ్డీకి రుణాలు తీసుకోవడం వల్ల కంపెనీకి రూ.2.19 కోట్లు నష్టం వచ్చినట్లు కాగ్ తన నివేదికలో పేర్కొన్నది. అలాగే కంపెనీ స్వల్పకాలిక డిపాజిట్లలో కాకుండా కరెంట్ అకౌంట్లలో ఉంచడం వల్ల 1.34 కోట్ల వడ్డీ నష్టం వచ్చిందని కూడా కాగ్ పేర్కొన్నది. అంతర్గత ఆడిటింగ్ కంట్రోల్ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం గురించి కాగ్ పేర్కొన్నది.
|
|
|
|
|
|
|