| పట్టంచుతో పండుగ శోభ |
| శుక్ర వారం, మార్చి 12, 2010 , 8:34 [IST] |
 |
|
మార్కెట్లో మోడరన్ దుస్తులు ఎన్నెన్ని పుట్టుకొస్తున్నా... చీరకట్టుకున్న అందమే వేరు కదా! మన పండుగలకు వచ్చే కొత్తందం వర్ణాలన్నీ ఒంటికి చుట్టుకుని సొగసంతా తమదేనంటూ ఇంట్లో తిరుగాడే ఆడవాళ్ళ వల్లే! అతివల్ని అందంగా ముస్తాబు చేసే చీరలెన్నో ప్రస్తుతం కొలువ్ఞదీరాయి. జార్జెట్ జరీబుటా, కంచి థ్రెడ్‌వర్క్, క్రేప్ ఎంబ్రాయిడరీ వంటి లేటెస్ట్ చీరలతో పాటు కళాతృష్ణగల డిజైనర్స్ నుంచి జాలువారిన అధునాతన వస్త్ర, శోధనలో ఉన్న మహిళల కోసం సెలెక్షన్‌కు తడుముకునే అవకాశం లేకుండా నచ్చిన డిజైన్ ఎంపిక చేసుకొని ఈ పండుగకు కొత్త చీరతో ముస్తాబవండి.
మరి ఈ కొత్త సంవత్సరపు వేడుక శోభాయమానం కావాలంటే, కొంగొత్త వర్ణాలు, పట్టంచుల పరిమళాలు... అరుదైన ఎంబ్రాయిడరీలు, అందమైన జరీ బుటాలు... ఆధునికత మేళవించే కొత్త డిజైన్లు చెలులకోసం...
|
|
|
|
|
|
|