మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
పరీక్షల వేళ ప్రశాంతంగా
శుక్ర వారం, మార్చి 12, 2010 , 8:33 [IST]
రాజపూడి శరత్‌కౌముదీ శ్రీనివాస్‌

studyమార్చి నెల వచ్చిందంటే ఎగ్జామ్స్‌ ఫోబియా మొదలౌతుంది పిల్లలకు, తల్లిదండ్రులకు. విద్యా సంవత్సరం ఆసాంతం ఒక ఎత్తు, ఈ సమయం ఒక ఎత్తు. ర్యాంకుల ఆరాటం, చదువ్ఞల పోరాటంతో విపరీతమైన ఒత్తిడికి గురి చేసే కాలం ఇది.ఇంట్లో పెద్దవాళ్ళ ఒత్తిళ్ళతో బేజారవుతున్న విద్యార్థులకు విద్యాలయాలు, కళాశాలల ర్యాంకుల పోటీని తట్టుకోవడం మరింత ఒత్తిడికి గురి చేస్తోంది. మళ్ళీ వచ్చే సంవత్సరారంభానికి, ఈ సంవత్సరం రిజల్ట్స్‌ ఓ ప్రతిష్టగా తీసుకునే నేప ధ్యంలో రాత్రింబవళ్ళు విద్యార్ధులను ఓ యంత్రా లుగా తీసుకొనే వైనాలు కూడా దర్శనీయమే.ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా పిల్లల కెరీర్‌పైనే దృష్ఠి సారిస్తూ ఎంతగా కష్టపడితే అంత ఫలం ఈ పోటీ ప్రపంచంలో అన్న ధోరణి కనబరు స్తుంటారు. మంచిదే, కానీ పిల్లల కోణం నుంచి ఆలోచిస్తున్నారా? లేదా అనేదే ప్రశ్న.

పిల్లల మానసిక పరిస్థితిని అంచనావేయగల్గుతున్నారా? ఉదాహరణకు టెన్త్‌క్లాస్‌ పిల్లల విషయమే తీసు కుంటే ప్రభుత్వాలే ఈ సంవత్సరం 100 శాతం రిజల్ట్స్‌ సాధనే ధ్యేయంగా గత మూణ్ణెల్లనుంచే వరుసగా పరీక్షల విూద దృష్టి పెట్టాయి. 24 గంటలు చదవడం పరీక్షలు వ్రాయడమే లోకమైంది.ఇప్పటికే విద్యార్ధులు చెరుకురసం తీసేసిన పిప్పిలా తయారౌతున్నారు. ఆది వారాలు, సెలవ్ఞ దినాలు మృగ్యమైనాయి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. పిల్లల్లో శ్రావ్య శక్తి సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది. అకడమిక్‌ సంవత్సరంలో చేసిన శ్రమ వృధా పోదు. పైగా యూనిట్‌, త్రైమాసిక, అర్ధ సంవత్సర, స్పెషల్‌ ఎసైన్‌మెంట్స్‌ ప్రీ పబ్లిక్‌ పరీక్షలు షెడ్యూలు ప్రకారం ఉంటాయి.

వీటితోనే స్పష్టమైన అవగాహనకు వస్తారు. పరీక్షల ముందురోజుల్లోనే 'టెన్షన్‌ ఫ్రీ వాతావరణం అవసరం. ప్రముఖ విద్యావేత్తలు, తత్వవేత్తలు చెప్పేది ఏమిటి? స్వేచ్ఛాయుత వాతావరణంలోనే విద్యార్జన జరిగితే విద్యార్ధి సమగ్రాభివృద్ధి సాధ్యపడ్తుందని చెప్పారు. కానీ ఇందుకు భిన్నంగా నేడు జరుగుతున్నదేమిటి? పంజరంలో పక్షుల్లాగా బందీలుగా ఉంచుతూ చదువే సర్వస్వం. ర్యాంకులు రాకపోతే జీవితంలో ఏం సాధించలేం అన్న గీతోపదేశాన్ని ఇంజెక్ట్‌ చేయడమే. దీని పర్యవసానం భవి ష్యత్తులో ఎలా పరిణమిస్తుందో తెలియదా? ర్యాంకులు, ఆశించిన స్థాయిలు పొరపాటున రాకపోతే వారి మానసిక పరిస్థితులు, ఆపై వారు మరేవైనా అనుచిత చర్యలకు పాల్పడితే అందుకు ఎవరు బాధ్యులు?  ఇష్టపడి చదివే విధానాన్ని వారికి తెలియచేయాలి కానీ 'ఆహోరాత్రులు కష్టపడండి. ఇదే జీవితంలో కీలకం.

ఇది లేకుంటే ఎందుకు పనికిరారు అంటూ భయోత్పాతాన్ని వారి గుండెల్లో నింపకూడదని గ్రహించాలి. అసలు, పరీక్షల నేపధ్యంలోనే పిల్లలకు పోటీతత్వం సహజంగా ఉంటుంది. ఉపాధ్యాయుల, అధ్యాపకుల వార్నింగ్స్‌ ఉంటూనే ఉంటాయి. స్నేహితుల చతురోక్తులు, ఎత్తి పొడుపుమాటలు ఉంటూనే ఉంటాయి. సున్నిత మనస్కులైన పిల్లలు తక్కువ మార్కులు వస్తేనే తల్లడిల్లిపోతారు. ఇక పబ్లిక్‌ పరీక్షల సమయంలో మార్కుల, ర్యాంకుల సాధన ఎలా ఉంటుందోనని భయమూ ఆవహిస్తుంది. తల్లిదండ్రుల్లోనూ, విద్యావ్యవస్థలోనూ ఈ దృక్పథం మారాలి. పిల్లలకోణం నుంచి ఆలోచించి సమయ సందర్భాలను ఎంచుతూ సముచితమైన సలహా నివ్వాలి. 24 గంటలు కూర్చోబెట్టినంత మాత్రాన 'విషయ పరిజ్ఞానం మొత్తం అవగాహన కొస్తుందా?

ఇదంతా ఒక పార్శ్వమైతే పిల్లల ఆరోగ్య పరిరక్షణ సంరక్షించడం మరో పార్శ్వంగా ఉండాలి. చదువ్ఞలపోరు మానసికంగా అలసటకు గురి చేస్తుంది. శరీరంపైన కూడా దీని ప్రభావం ఉంటుంది. వేళాపాళ పాటించకుండా ఆహారం తీసుకోవడం, తీసుకునే ఆహారంపైన కూడా దృష్ఠిలేకుండా ఉండటం. నోట్లో ముద్ద ఉండగానే స్పెషల్‌ క్లాస్‌లంటూ పరుగులు తీయడం వంటివి ఎదిగే వయసును అదిమివేస్తాయి.  ఇక పబ్లిక్‌ పరీక్షల సమయంలో అదేపనిగా చదివే వైనాన్ని కాస్తంత తగ్గించాలి.

డీలా పడిపోకుండా, నీరసపడిపోకుండా చూడాలి. చాలామంది పిల్లలు ఎగ్జామినేషన్‌ హాల్లోనే కళ్ళు తిరిగిపడిపోవడం చదివినవన్నీ గుర్తుకు రాకపోవడం, హైరానా పడిపోతూ ముగించడం, రిజస్టర్‌ నెంబర్లు, పూర్తి చేయాల్సిన ఓ.యం.ఆర్‌. షీట్లను తప్పుల తడికలతో పూరించడం.ఆపై ఎగ్జామినర్ల విసు గుతోకూడిన ప్రతిస్పందనలు, కొత్త వాతావరణం ఒక్కొసారిగా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రెండున్నర లేదా మూడుగంటల వ్యవధిలో తమ భవిష్యత్తును నిర్ణయించే పరీక్షలను ఎదుర్కోవడంలో ఇలా ఎన్నో ఆటుపోట్లు.

అతిగా చెప్పే జాగ్రత్తలు కూడా పిల్లల్లో గుబులును రేకెత్తిస్తుంది. 'పరీక్షలనేవి సాధారణమే. ఇష్టపడి చదవండి. అంటూ ప్రోత్సహించే పద్ధతినే పాటించాలి. చదివే గంటలను నిర్ధారించాలి. మానసిక వత్తిడి కలిగించే వాతావరణాన్ని దూరం చేయాలి. పాజిటివ్‌గా వారి మాటలను తీసు కుంటూ సమస్యలేవైనా ఉన్నాయేమో తెలుసుకొని తగురీతిగా స్పందిస్తూ వారితో స్నేహంగా మెలగాలి. అప్పుడే 'టెన్షన్‌ ఫ్రీ గా చదువ్ఞల్లో, పరీక్షల్లో కృతకృత్యులౌతారు.
 
 User Comments
[ Post Comments ]  
Be the first to comment this Article.
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 రాధాతత్త్వము
 స్నేహితులంటే ఎలా ఉండాలి?
 సమానవాదమే మనవాదం
 మెప్పించే మాటతీరు
 పిన్నవయసు సిఇఒ
 తల్లిపాల బ్యాంకు మరొకటి
 సీ'రియల్'‌లో వాస్తవాలెక్కడ?
 రాఖీ వెనుక రాచగాధలు
 పాక్‌ ప్రధాని లత అభిమాని
 వీణా వాదనలో ప్రవీణ
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com