మనదేశంలోనే కాదు విదేశాల్లో కూడా భారతీయ మహిళల హవా కొనసాగుతోంది. అందుకు నిదర్శనాలు అనేకం ఉన్నాయి. తాజాగా ప్రవాసభారతీయురాలు కామ్లా ప్రసాద్ బస్సేనర్ ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా అత్యధిక మెజారిటీతో (18103 ఓట్ల తేడాతో) ఎంపికయ్యారు. ఇంత మెజారిటీతో ఓ మహిళ ఎన్నికకావడం ఆ దేశంలో ఇదే తొలిసారి. దీంతో భారతీయుల సత్తా మరోసారి ప్రపంచ దేశాలకు తెలిసింది.
కార్లా ప్రసాద్ బస్సేనర్ ఏప్రిల్ 4, 1952లో స్పిరియాలో జన్మించారు. తల్లి ట్రినిడియన్, తండ్రి భారతీయ సంతికి చెందిన వ్యక్తి. ఆమె మోహి స్‌రోడ్ హిందూస్కూల్‌లో ప్రాథమిక విద్యను పూర్తిచేశారు. ఇరిన్‌రోడ్‌లోని ప్రెస్బిటేరియన్ స్కూల్లో సెకండరీ ఎడ్యుకేషన్‌ను పూర్తిచేశారు. ఇది కో ఎడ్యుకేషన్ పాఠశాల. అందులో చదివిన మొదటి మహిళగా రికార్డుకెక్కారు.పై చదువులకు లండన్ వెళ్లారు. అక్కడి నార్‌వుడ్ టెక్నికల్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌కోర్సును పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్‌ఇండీస్‌లో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ లా, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో పట్టాలను అందు కున్నారు. తరువాత స్కూల్ టీచర్‌గా ట్రినిడాడ్ అండ్ టొబాగో, జమైకాలలో పనిచేశారు. అప్పుడు కామ్లా వయస్సు 25ఏళ్లు. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్‌ఇండీస్ కళాశాలలో లెక్చరర్‌గా చేరారు.అతిచిన్న వయస్సులోనే లెక్చరర్ అయిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు.
లెక్చరర్‌గా ఉన్న సమయంలో బ్రెస్సేనర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అప్పుడు తన వయస్సు 34ఏళ్లు. ఒక కొడుకు పేరు క్రిస్. లెక్చరర్ పదవికి రాజీనామాచేసి లాని కెరియర్‌గా ఎంచుకున్నారు. హ్యూజ్‌వుడ్ లా స్కూల్లో లాలో మాస్టర్‌డిగ్రీని పూర్తిచేసి కళాశాలలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఆ సమయంలో ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్‌ను పొందారు. ఆ కళాశాల తరఫున బెస్ట్ వోవరాల్ స్టూడెంట్ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఐఒబిలో ఎంబిఎ చదువుతున్నారు. చివరి సెమిస్టర్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు. మిగిలిన అన్ని సెమిస్టర్‌లలో 12 ఎస్‌ను పొంది మొదటి స్థానంలో ఉన్నారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ను గత ఏడాదే పూర్తిచేశారు 58ఏళ్ల కామ్లా ప్రసాద్.
రాజకీయాల విషయానికి వస్తే ట్రినిడాడ్ అండ్ టొబాగోకు మొదటి మహిళా ప్రధానిగా ఎన్నికయ్యి రికార్డు సృష్టించారు. 1955లో పాండీ ప్రభు త్వంలో మొట్టమొదటి అటార్నీ జనరల్‌గా పనిచేశారు. 2000 సంవత్సరంలో యునైటెడ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా డిసెంబర్ 22వరకు పనిచేశారు. ఏప్రిల్ 2006లో ప్రతిపక్షనేతగా ఎంపీలు కామ్లాను బలపరిచారు. ఆ సమయంలో ప్రతిపక్షనేతగా కొనసాగారు. ఇంతకు ముందు ఇదే స్థానంలో పాండీ 34ఏళ్లుగా ఈ పదవిలో కొనసాగారు.యుఎన్‌సి ప్రతిపక్ష నేతను ఎన్నుకునేందుకు 2010 జనవరి 24వ తేదీన ఎన్నికలు నిర్వహించింది. ఈ ఎన్నికల్లో పాండీతో కామ్లా పోటీపడింది. అత్యధిక మెజారిటీతో పాండీపై గెలుపొంది పార్లమెంటులో ప్రతిపక్షనేతగా అవతరించింది. ఎవరూ ఊహించ నంతగా 18103 ఓట్ల తేడాతో ఈ విజయాన్ని సొంతం చేసుకుంది.
1980ల్లో రాజకీయాల్లోకి వచ్చిన కామ్లా ప్రసాద్ యస్‌టి పాట్రిక్ కౌంటీకి ప్రాతినిధ్యం వహించారు. సెనెటర్‌గా సేవలందించిన కామ్లా పార్లమెంటే రియన్‌గా రాణించారు. విద్యాశాఖ మంత్రిగా పదవిని నిర్వర్తిస్తున్న సమయంలో సెకండరీ ఎడ్యుకేషన్‌ను బాగా డెవలప్‌చేశారు. కామన్ ఎంట్రన్స్‌టెస్ట్‌లను రద్దుచేసి దానిస్థానంలో సెకండరీ ఎంట్రన్స్ అసెస్‌మెంట్ టెస్ట్ (ఎస్‌ఇఎ)ను ప్రవేశపెట్టారు. తన రాజకీయ జీవితంలో ఇది చాలా పెద్ద అచీవ్‌మెంట్.రాజకీయంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు కామ్లా ప్రసాద్. ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందరికీ సమా నంగా అందించడమే. పార్లమెంటులో కొన సాగుతూనే లాయర్‌గా కూడా ప్రజలకు సలహాలను అందిస్తున్నారు.
ఆమె అందుకున్న అవార్డులు హ్యూజ్ వుడ్డింగ్ లా స్కూల్ నుంచి ఔట్‌స్టాడింగ్ స్టూడెంట్ ప్రైజ్, అందరికన్నా ఎక్కువ ప్రతిభ ఉన్న విద్యార్థిగా అవార్డు అందుకున్నారు. నిస్ట్రీ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ వారి నుంచి సామాజిక సేవారంగంలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన మహిళగా అవార్డును పొందారు.ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్, కేంబ్రిడ్జి, ఇంగ్లాండ్ వారినుంచి అసమాన సేవలను అందిస్తున్నందుకుగాను అవార్డును అందుకున్నారు.