మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

Bharathmatrimony
లాగిన్ | రిజిస్టర్
టిప్పు సుల్తాన్‌ వేసవి విడిది నందిహిల్స్‌
గురు వారం, మార్చి 11, 2010 , 2:04 [IST]
మల్లాది రామలక్ష్మి

yatraకర్నాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్‌కు 10కి.మీ దూరంలో ప్రసిధ్ధ వేసవి విడిది నందిహిల్స్‌ ప్రాంతం ఉంది. చోళరాజుల పరిపాలనాకాలంలో ఈ ప్రాంతాన్ని ఆనందగిరిగా పిలిచేవారు. నందిహిల్స్‌ నిద్రిస్తున్న నంది ఆకారంలో ఉండటం వలన ఈ ప్రాంతాన్ని నందిహిల్స్‌, నంది దుర్గం అని పిలుస్తారు. గంగరాజుల కాలంలో ఇక్కడ  ఒక కోటను నిర్మించారు. అటుపై టిప్పుసుల్తాన్‌ ఆ కోటను పునరుధ్దరించి వేసవి విడిదికై ప్రత్యేకంగా ఒక భవనాన్ని నిర్మించాడు. కోట లోపల యూకలి ప్టస్‌ వంటి భారీవృక్షాలు కనువిందు చేస్తాయి. నందిహిల్స్‌కు ప్రధాన ఆకర్షణ అమృత సరోవరం. దీనిలోని స్వచ్ఛమైన జలాలు అమృతతుల్యంగా ఉంటాయి.

నందిహిల్స్‌ పాదభాగంలో భోగనందీశ్వర ఆలయం ద్రావిడ శిల్పశైలితో అందంగా ఉంటుంది. పెన్నార్‌, పాలార్‌, అల్కావతి నదులు నందిహిల్స్‌ నుండి ప్రారంభమై ప్రవాహంగా సాగుతాయి. కొండ మీద ఉగ్రనరసింహ, యోగనరసింహ ఆలయాలు ఉన్నాయి. మరో చెప్పుకోదగిన అంశం ఏమిటంటే విశ్వవిఖ్యాత ఇంజనీర్‌ శ్రీమోక్షగుండం విశ్వేశ్వ రయ్య ముద్దెనహళ్ళిలోనే జన్మించారు. ఆయన నివాస గృహాన్ని నవీన కన్నడ నిర్మాణశైలితో మ్యూజియంగా మార్చారు. ఈ ప్రాంతం నంది హిల్స్‌కు అతి సమీపంలో ఉంది. శివపార్వతుల ఆలయం కొండపై చూడదగినది.
ఇక్కడి వాతావరణం చల్లగా ఆహ్లాదభరితంగా ఉండటం వలన సంవత్సరంలో ఏ కాలంలో అయినా నందిహిల్స్‌ను సందర్శించవచ్చు. ఇక్కడి రిసార్ట్‌లు ఏకాంతాన్ని కోరే జంటలకు సౌకర్య వంతంగా ఉంటాయి.

గజిబిజి బిజీ జీవితానికి అలసిన మనసు  వేసవిలో సేదతీరాలంటే నంది హిల్స్‌ను చూడవచ్చు. తక్కువ బడ్జెట్‌లో ప్రశాంత తను విశ్రాంతిని ఇక్కడ పొందవచ్చు. సహజ ప్రకృతిలో, అందమైన దృశ్యాలతో దట్టమైన చెట్లతో ఆరోగ్యవంతమైన వాతావరణం మధ్యగల ఈ ప్రశాంత ప్రదేశానికి బెంగళూరువాసులు వారాం తపు సెలవ్ఞలను గడిపేందుకై తరచూవస్తుంటారు. కర్నాటక రాష్ట్ర ఉద్యానవన శాఖవారు సందర్శకు లకు ఆహ్లాదాన్ని కలిగించేందుకై ఇక్కడ తోటలను పెంచుతున్నారు. ఉద్యానవన శాఖవారి రెస్టారెంట్‌, కర్నాటక పర్యాటక శాఖవారి 'మయూర రెస్టారెంట్‌ ఇక్కడ ఉన్నాయి.

చిక్‌బళ్ళాపూర్‌లో సముద్ర మట్టానికి 4851 అడుగుల ఎత్తున ఉన్న ఈ ప్రాంతం చల్లగా అనువైన వాతావరణంతో ప్రకృతి ప్రేమికుల్ని అలరిస్తోంది. ఇక్కడి నవీన వసతి సదుపాయాలు, కొండపై సకలవసతులు ఉండటం వలన పర్యటనలో ఎలాంటి  అసౌకర్యం మనకు కలగదు. నెహ్రూ, గాంధీజీలు విడిదిచేసిన ప్రదేశా లను వారి జ్ఞాపకార్ధం సందర్శకులు దర్శించేందుకై సందర్శనా స్థలాలుగా మార్చారు. కిందినుండి ఎగువ కొండకు 8 కి.మీ రోడ్డు మార్గం ఉంది. గతంలో కబ్బన్‌ 18 గదుల గృహాన్ని కట్టించాడు. ఇది కబ్బన్‌హౌస్‌గా ఇపుడు సందర్శకులకు అందుబాటులో ఉంది. గతంలో మహాత్మాగాంధీ, పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, రాజీవ్‌, మార్క్‌క బ్బన్‌, క్వీన్‌ ఎలిజబెత్‌-2 వంటి ఎందరో ప్రముఖు లను ఈ ప్రాంతం ఆకర్షించింది. ఈ నంది హిల్స్‌ పరిసరాల్లో ఎన్నో చూడగిన ప్రాంతాలు ఉన్నాయి.

టిప్పుసుల్తాన్‌ వేసవి విడిది, కోట
గంగరాజులు కట్టించిన కోటను  టిప్పుసుల్తాన్‌ అభివృద్ధి చేశాడు. వేసవిలో తాపానికి  ఉపశమనం పొందేందుకై టిప్పుసుల్తాన్‌  ఇక్కడ వేసవి విడిదికై ప్రత్యేకంగా విడిది గృహాన్ని ఏర్పాటు చేశాడు. టిప్పుసుల్తాన్‌ కోట 90 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటై ఉంది.
సైనికుడు ఈ కోటలో దాగి శత్రువ్ఞలపై ఒకేసారి నాలుగు దిక్కులకు గురిపెట్టి కాల్చేందుకు వీలుగా వ్యూహాత్మకంగా నిర్మించారు.

యోగనందీశ్వరాలయం  
అందమైన శిల్పకళా నైపుణ్యంతో కనువిందుచేసే ఈ ఆలయం చూడదగినది.

టిప్పు డ్రాప్‌
టిప్పుసుల్తాన్‌ కాలంలో ఖైదీలను ఈప్రాంతం నుండి క్రిందకి తోసేవారు. ఇది ఖైదీలకు విధించే ఒకరకమైన శిక్ష.

రహస్య సొరంగం
శత్రుసైనికులు కోటను అకస్మాత్తుగా చుట్టుముట్టినపుడు రక్షణార్ధం రాజులు ఈ సొరంగాన్ని బయటకు వెళ్ళేమార్గంగా ఏర్పాటుచేసుకున్నారు.

ముద్దన హళ్ళి
నందిహిల్స్‌కు 21 కి.మీ దూరంలో ముద్దన హళ్లి ప్రాంతం ఉంది. ఇక్కడ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మ్యూజియాన్ని చూడవచ్చు. ఇంకా ఆంజనేయ, భోగనందీశ్వర ఆలయాలను చూడవచ్చు. నంది హిల్స్‌ను ఉదయం 6గంటల నుండి రాత్రి 10 గంటల వరకు చూడవచ్చు.

ఎలాచేరాలి
బెంగళూరు, చిక్‌బళ్ళాపూర్‌, నంది గ్రామ నుండి బస్సుసౌకర్యం ఉంది. బెంగుళూరు నుండి 2 గంటల సమయంలో నందిహిల్స్‌ను చేరవచ్చు.  బెంగుళూరు విమానాశ్రయం 65 కి.మీల దూరంలో ఉంది. నంది హిల్స్‌కు 9 కి.మీ దూరంలో చిక్‌బళ్ళాపూర్‌ రైల్వేస్టేషన్‌ ఉంది.
ఇక్కడకు 65 కి.మీ దూరంలో గల బెంగళూరు నుండి చిక్‌బళ్ళాపూర్‌కు రైళ్ళూ తరచుగా ఉన్నాయి. బెంగళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఉన్న అందమైన వేసవి విడిదిని దర్శించి వేసవితాపాన్ని పోగొట్టుకుంటారు. వేసవి మొదలైన కారణంగా చల్లని ఈ ప్రాంతాన్ని యాత్రికలు సందర్శించవచ్చు.
 
 User Comments
[ Post Comments ]  
By: sobha,vij
On: 30 Mar 2010 03:55 pm

అన౦తపుర౦ను౦డి ఎట్ల వెళ్లాలో తెలియజేయ౦డి

Reply |  Report abuse


By: prasadarao TSV
On: 22 Mar 2010 08:25 am

information given is very useful to tourists. Welcoming information about other tourist spots in Karnataka.

Reply |  Report abuse


[ Post Comments ]
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 అందమైన పక్షుల్లో అందని భావాలెన్నో
 ప్రణవనాదం అర్థం చెప్పిన..
 ఆధ్యాత్మిక కాంతుల అరుణాచలం!
 విమర్శించేవారిపై పగవద్దు
 మహిమాన్వితమైన నాభిగయ
 ఉత్తమ నైతికత్వం
 హరినామ స్మరణే ఉపదేశం
 కాశీకన్నా పురాతన గ్రామం 'బనవాసి
 తప్పులను ఎత్తిచూపవద్దు
 రాగ ద్వేషాలను తొలగిస్తే మనస్సు..
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com