మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
'ఇంటర్‌'లో 60 వేల మంది డుమ్మా
గురు వారం, మార్చి 11, 2010 , 9:43 [IST]

naina9 ఏళ్లకే పరీక్ష రాసిన నైనా 
అరకొర సౌకర్యాలతో  ఇబ్బందులు
హైదరాబాద్‌, మార్చి 10, ప్రభాతవార్త:
ఇంటర్‌ పరీక్షల్లో 60 వేల మందికిపైగా విద్యార్థులు బుధవారంనాడు పరీక్షకు గైర్హాజరయ్యారు. మొత్తం 9,24,440 మంది పరీక్ష రాయాల్సిఉండగా 60,973  మంది పరీక్షకు హాజరు కాలేదు. ఇంటర్‌ పరీక్షలు బుధవారంనాడు ప్రశాం తంగా ప్రారంభమయ్యాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి బలరామయ్య తెలిపారు. కొన్ని చిన్నసంఘటనలు మినహా పరీక్షలు సాఫీగా జరిగాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,331 పరీక్షా కేంద్రాల్లో  ప్రత్యేక పర్య వేక్షణ జరగడంవల్ల ఎలాంటి ఇబ్బందులు రాలేదని ఆయన అన్నారు. మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడిన 15 మంది విద్యార్థులను డీబార్‌ చేశామని పేర్కొన్నారు. హైదరా బాద్‌లో తొమ్మిది సంవత్సరాల నైనా అనే విద్యార్థిని ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు రాయడం విశేషం.

ఆవిద్యార్థిని విదేశాల్లో పదో తరగతి పాస్‌ కావడంతో ఇంటర్‌ పరీక్షకు అనుమతి ఇచ్చారు. రాష్ట్రం లోని పలుకేంద్రాల్లో వసతుల సమస్యతో విద్యార్థులు కిందనేకూర్చుని పరీక్షలు రాయాల్సివచ్చింది.  వసతి సౌకర్యం లేకపోవడంతో విశాఖపట్నం మహిళా కళాశాలతో సహాపలు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు నేలపై కూర్చుని పరీక్షలు రాయాల్సి వచ్చింది. చిత్తూరు జిల్లాలోని పలు కేంద్రాల్లో కరెంట్‌ సమస్య కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.విజయవాడలోని సయ్యద్‌ అప్పలస్వామి కళాశాల పరీక్షా కేంద్రంలో విద్యుత్‌ కోత వల్ల  చీకటిలోని విద్యార్థులు  పరీక్షలు రాయడానికి  ఇబ్బం దులు పడ్డారు. పరీక్షల సమయంలో కరెంట్‌ తీసేయవద్దని ఇంటర్‌బోర్డు అధికారులు కోరినప్పటికీ విద్యుత్‌ శాఖ వినకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్ప డ్డాయి.

inter examsతూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ కోతతో బుధవారం పరీక్ష రాసే సమయంలో ఇంటర్మీ డియట్‌ విద్యార్థులు ఇబ్బందులుపడ్డారు.మహబూబ్‌నగర్‌లో ఒక ప్రభుత్వ కాలేజీలో 60 శాతం హాజరు తక్కువగా ఉన్న విద్యార్థులకు హాల్‌ టిక్కెట్లు ఇవ్వలేదు. మరో కాలేజీలో మాత్రం 40 శాతం హాజరు ఉన్నప్పటికీ పరీక్షలకు అనుమతించడంతో విద్యార్థులు నిరసన తెలిపారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పది వేల మందికిపైగగా ఆవిద్యార్థులు హాజరు సమస్యతో పరీక్షలు రాయలేకపోయారు. హాజరు అంశాన్ని ప్రిన్సిపాళ్లకు అప్పగించామని ప్రభుత్వం పేర్కొంది. అయినప్పటికీ చాలా జిల్లాలో హాజరు తక్కు వగా ఉన్నవారు పరీక్షలు రాయలేకపోయారు. హాజరు శాతం తక్కువగా ఉన్నవిద్యార్థులను  ఇక అనుమతించబోమని ఇంటర్‌బోర్డు పేర్కొంది.

శ్రీకాకుళం, గుంటూరుతోపాటు మరికొన్ని జిలాల్లో హాల్‌ టిక్కెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు నిరసన తెలిపారు. మరి కొన్ని పరీక్షా కేంద్రాల్లో తాము కోరుకున్న లాంగ్వేజ్‌కు బదులు వేరే ప్రశ్నా పత్రం ఇవ్వడంతో అయోమయం నెలకొంది. ఈ విద్యార్థుల సమస్యను తెలుసుకున్న ఇంటర్‌బోర్డు వీరు రాయాల్సిన ప్రశ్నాపత్రాలను ఇవ్వడంతో సమస్య పరిషార్కరమయింది. 590 విద్యార్థుల విషయంలో ఇలాజరిగింది. తెలుగులేక సంస్కృతం పరీక్ష రాయాల్సిఉంటే అరబిక్‌ పశ్నాపత్రాలు ఇచ్చారన్న విమ ర్శలు వచ్చాయి.  ఉదయం ఇంటర్‌ బోర్డు కార్యదర్శి బలరామయ్య సెట్‌ 1  ప్రశ్నా పత్రాన్ని ఎంపిక చేశారు.  

హాల్‌టికెట్‌ నిరాకరణతో విద్యా సంవత్సరం నష్టం
ఎమ్మిగనూరు(సోమప్ప సర్కిల్‌), ప్రభాతవార్త:
పట్టణంలోని ఓ ప్రైవేట్‌ కళాశాల యాజమాన్యం కాలేజీ ఫీజులకే ప్రాధా న్యత ఇవ్వటం, ఫీజును చెల్లించినా హాల్‌టికెట్‌ మంజూ రుపై దృష్టిసారించక పోవడం జరిగింది. దీంతో విద్యార్థి విద్యా సంవత్సరం కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని హరిజనవాడకు చెందిన జె. విన§్‌ుకుమార్‌  వైష్ణవి కళాశాలలో జూనియర్‌ ఇంటర్‌ సిఇసి గ్రూపు చదువుతున్నాడు. పరీక్షల నిమిత్తం ఫీజు చెల్లించి ఐసిఆర్‌ బయోడేటా ఫామ్‌ పూర్తి చేశాడు. ఇంటర్‌ పరీక్షలు మార్చి 10వతేదీన జరుగుతుండటంతో మంగళ వారం కళాశాలకు వెళ్లి పరీక్షలకు హాజరుకావడానికి హల్‌టికెట్‌ ఇవ్వాలని క్లర్క్‌ను అడిగాడు.కళాశాల ఫీజు చెల్లించినతరువాతే హాల్‌టికెట్‌ ఇస్తామని ఆయన తెలిపారు.

బుధవారం విద్యార్థి తండ్రి హాల్‌ టికెట్‌ అడగగా ఫీజు చెల్లించాడని నిర్ధారించుకుని, తప్పు కప్పిపుచ్చు కునేందుకు ఐసిఆర్‌ఫామ్‌ ధరఖాస్తుచేశాడో లేదో నిర్ధారించుకోవాలని క్లర్క్‌కు సూచించాడు. దీనిపై విద్యార్థి తండ్రి ఆగ్రహాం వ్యక్తం చేస్తూ  ఫీజులను కట్టించుకున్న మీరు ఐసిఆర్‌ ఫామ్‌ను ఎందుకు పరిశీలించలేదని, ప్రస్తుతం హాల్‌టికెట్‌ రాలేదని తాము ప్రశ్నిస్తే ఐసిఆర్‌ఫామ్‌ పూర్తిచేయలేదని చెప్పి తప్పించుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. కళాశాల సిబ్బంది నిర్లక్ష్యంవల్లే తన కుమారుడు విద్యా సంవత్సరం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ సుందర రాజును 'ప్రభాతవార్త వివరణ కోరగా విద్యార్థి ఐసిఆర్‌ బయోడేటా ఫాంను పరిశీలించి జూన్‌లో పరీక్షలు రాసే విధంగా సహకరిస్తామని పేర్కొన్నారు.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 'ఓదార్పు' నిజాయితీని గుర్తించారు
 కష్టాలు అధిగమించడమే నా సక్సెస్
 సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
 ఒయులో అసలేం జరిగిందంటే
 జగన్‌కు సోనియా ఝలక్‌
 రాజకీయాలు పూల బాటకాదు, ముళ్లబాట..
 పోలీస్‌ చమత్కారం?
 డాక్టర్‌ గిరీష్‌ సంఘీకి సిఎం..
 పిహెచ్‌డి విద్యార్థులతో పాఠాలు
 కార్యదీక్ష, దృఢ సంకల్పం వైశ్యుల..
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com