గాలి పోగేసి, గోలచేయొద్దు బాబుపై మంత్రి కన్నా ఎదురుదాడి జవాబు దాటేసిన ప్రభుత్వం బ్రహ్మణి స్టీల్స్‌పై దద్దరిల్లిన సభ హైదరాబాద్,మార్చి10,ప్రభాతవార్త: బ్రహ్మణిస్టీల్స్, ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి కేటాయించిన గనులు వివాదం బుధవారం శాసనసభను మరో సారి కుదిపేసింది. అధికార, విపక్ష సభ్యులు పర స్పర ఆరోపణలతో సభ పక్కదారి పట్టింది. ప్రశ్నోత్తరాల్లో భాగంగా బ్రహ్మణీ స్టీల్స్‌కు కేటా యించిన గనులపై టిడిపి నేత ఎన్ చంద్ర బాబునాయుడు మాట్లాడుతూ మైనింగ్ మాఫి యాకు సర్కార్ దన్నుగా నిలుస్తుందని తీవ్ర ఆరో పణ చేశారు.
చంద్రబాబు ఆరోపణలపై అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, టిడిపి సభ్యులు మాట్లాడకుండా పదేపదే అడ్డుకు న్నారు.aఅధికార, విపక్షసభ్యులు ఆవేశాలకు గురి కావద్దని స్పీకరు ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వినతులను సభ్యులు ఏమాత్రం పట్టించుకోకపోవ డంతో సభాపతి సభను రెండు సార్లు వాయిదా వేశారు. అధికార, విపక్ష సభ్యులు వాగ్వివాదంతో పిఆర్‌పి సభ్యుడు కన్నబాబు, సిపిఐ పక్షనేత మల్లేష్, లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ, సిపిఎంనేతజూలకంటిరంగారెడ్డిఓఎంసి, బ్రహ్మణి స్టీల్స్‌పై సూటిగా అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండానే తప్పించుకోగలిగింది.
ఒఎంసికి కేటాయించిన భూమికి సంబంధించి 2 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వానికి చెల్లిం చిన ఆ భూమిని 350 కోట్లకు బ్యాంకులో తనఖా పెట్టిన విషయం, ఇనుప ఖనిజాన్ని ఎగు మతి చేయడానికి ప్రభుత్వం అనుమతించడాన్ని, విశాఖ స్టీల్‌కు గనులు కేటాయించకపోవడం తది తర ప్రశ్నలపై ప్రభుత్వం వైపు నుండి సమా ధానం రాలేదు.తొలుత బహ్మణీ స్టీల్స్‌కు కేటాయించిన గనుల అంశాన్ని టిడిపి సభ్యుడు నాగం జనార్దనరెడ్డి లేవనెత్తారు. కాప్టివ్ మైనింగ్‌కి కేటాయించిన గనులనుండి ఇనుపఖనిజాన్ని ఓఎంసి ఏ విధంగా ఎగుమతి చేస్తుందని ఆయనప్రశ్నించారు. ఇప్పటి వరకు ఒఎంసి తవ్వితీసిన ఇనుప ఖనిజం, ఎగు మతి చేసిన ఖనిజ వివరాలను ఆయన అడిగారు.
ఎ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఒఎంసికి గనులు కేటాయించడాన్ని కేంద్రం నిరాకరించిన విష యాన్ని గుర్తు చేశారు. అయితే, ఓఎంసి 20వేల కోట్ల రూపాయలతో స్టీల్‌ఫ్యాక్టరీ పెడుతున్న కార ణంగానే గనులు కేటాయించామని ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని ఆయన చెప్పారు.స్టీల్ ఫ్యాక్టరీ కోసమని తీసుకున్న గనుల నుండి ఇనుప ఖనిజాన్ని ఒఎంసి ఏ విధంగా ఎగుమతులు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. బ్రౌన్ షుగర్ అమ్ముకుని సుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసు కోవడానికి అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వ తీరు ఉందని ఆరోపించారు.రేవంత్‌రెడ్డి ప్రశ్నను డ్రగ్స్‌తో ముడిపెట్టడాన్ని స్పీకరు తప్పుపడుతూ మైక్‌ను కట్ చేసి, పిఆర్‌పి సభ్యుడు కన్నబాబుకు అవకాశం ఇవ్వడాన్ని టిడిపి సభ్యులు ప్రశ్నిం చారు. టిడిపి నేత చంద్రబాబు మాట్లాడటానికి ప్రయత్నించిన ప్రతిసారి కాంగ్రెసు సభ్యులు అడ్డుచెప్పడంతో, సభలో సాధారణ పరిస్థితి నెల కుంటేనే మాట్లాడతానని పలుసార్లు ఆయన కూర్చోవడంతో అధికారపక్ష సభ్యులను శాంతపర్చ డానికి స్పీకరు పలుపాట్లు పడ్డారు. చీప్ విప్ మల్లు భట్టి విక్రమార్క, శైలజానాధ్‌లతోపాటు అధికారపక్ష సభ్యులు చంద్రబాబును మాట్లాడ టానికి అనుమతించవద్దని అన్నారు.
మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జోక్యం చేసుకుని పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చంద్రబాబు నాయుడు సైంధవపాత్ర పోషిసు న్నారని ఆరోపణలకు దిగారు. ఈ సమయంలో సభలో నెలకొన్న గందరగోళాన్ని అదుపు చేయడానికి స్పీకరు కిరణ్‌కుమార్ రెడ్డి లేచి నిలబడి సభ్యులను కూర్చోమని పదే పదే విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విప్ శైలజానాధ్ మాట్లాడుతూ బ్రహ్మణీ స్టీల్స్‌పై ఎన్నిసార్లు మాట్లాడతారని ప్రశ్నించారు. 'పోయి, పారిపోయి వచ్చారు కద్ఞా అని నాగంపై పరోక్ష విమర్శలకు దిగారు. మంత్రులు, అధికారపక్ష సభ్యులు చేస్తున్న ఆరోపణలపై చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
తమ సభ్యుడు బ్రౌన్ షుగర్ అంటేనే అడ్డుకున్నారు. మంత్రి ఏమి మాట్లాడారో మీరు చెప్పండని స్పీకరును అడిగారు. కర్ణాటకలోని కాంగ్రెసు పార్టీ మైనింగ్ మాఫియా, గాలి జనార్దనరెడ్డికి వ్యతిరేకంగా ప్రచురించిన పుస్త కాన్ని, చేస్తున్న పోరాటాన్ని ఉదహరించారు. ఇక్కడ ఆ మైనింగ్ మాఫియాకు కాంగ్రెసు ప్రభుత్వమే ఏ విధంగా మద్దతు ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. దీన్ని తాము సమర్ధించాలా అని ఆవేశంగా ప్రశ్నించారు. ఒఎంసికి కేటాయించిన గనులపై సిబిఐ విచారణకు దివంగత ముఖ్యమంత్రి ఆదేశించిన విషయాన్ని అధికారపక్ష సభ్యులు గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఏ అక్రమాలు లేకపోతే సిబిఐ విచారణకు ఎందుకు అనుమతి ఇచ్చారన్నారు. కాంగ్రెసు పార్టీ సిగ్గుతో తలదించుకోవాలన్నారు.
అధికారపక్ష సభ్యుల అభ్యంతరాలతో చంద్రబాబు వ్యాఖ్యలను సభాపతి రికార్డుల నుండి తొల గిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వెనకబడిన రాయల సీమలోని కడప, అనంతపురం జిల్లాల్లో అభివృద్ధి జరగకుండా చంద్రబాబు, టిడిపి నేతలు అడ్డు కుంటున్నారని ఆరోపించారు. ''గాలి పోగేసి, గోల చేసి, ప్రజాసమస్యలు చర్చకు రాకుండా పారిపోవద్దు. చంద్రబాబుకు దమ్ముంటే విన మనండి. మేము చెబుతాం అని తీవ్ర స్వరంతో అన్నారు. శాసనసభ పక్ష నాయకురాలు జి గీతారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని మైనింగ్ మాఫియాని చేసిన ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పు కోవడానికి అవకాశం ఇవ్వాలని లేకపోతే ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ పోతుందని అన్నారు.
చంద్రబాబు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ఆయన వైఖరి వల్ల పారిశ్రామిక వేత్తలు పారి పోతున్నారని ఇది కచ్చితంగా క్రైమ్ అని ఆయన అన్నారు. కేజీబేసి న్‌కు సంబంధించి ఓఎన్‌జిసి సర్వే చేసి గ్యాస్‌నిక్షేపాలను కనుగొంటే ప్రైవేటు సంస్థకి ఏ విధంగా ఇచ్చారని నిలదీశారు. నువ్వా మమ్మల్ని మాఫియాని విమర్శించేదని ప్రశ్నిం చారు. మంత్రి కన్నా వ్యాఖ్యలపై టిడిపి సభ్యుడు నరేందర్‌రెడ్డి జోక్యం చేసుకుని మంత్రి మాట్లాడే భాషేంటి? రౌడీలా మాట్లాడుతున్నారు? రౌడీనా అని ప్రశ్నించారు.
చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు చీమకుర్తి గనులకు సంబంధించి అంతర్జాతీయ బిడ్‌లను ఆహ్వానించి క్యూబిక్ మీటర్‌ను 44వేల రూపాయలకు వస్తే, కొంత మంది సుప్రీంకోర్టుకి వెళ్ళడంతో ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు ప్రభుత్వం కోర్టు బయట క్యూబిక్ మీటర్‌కి 4వేల రూపాయలకు ఏవిధంగా ఒప్పందం చేసుకుందని ప్రశ్నించారు. మధ్యలో గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతు నాగం జనార్దనరెడ్డి ముందు నుండి ఓఎంసిపై కక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపిం చారు. బళ్లారి కంపెనీ నుండి టిడిపి వాళ్లకు ముడుపులు అందాయని ప్రజలు అనుకుంటు న్నారని, అది నిజమేనని వారు చేస్తున్న గొడవను బట్టి అర్ధమవుతుందన్నారు. ఈ వివాదం పై కోర్టు ఇచ్చే డైరెక్షన్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు.