మెత్తబడిన ఎస్‌పి, ఆర్‌జెడి న్యూఢిల్లీ,మార్చి 10 : రెండురోజులుగా పార్లమెంట్‌లో తీవ్రస్థాయిలో నాటకమాడిన అనంతరం యుపిఎ మిత్రపక్షాలైన ఎస్‌పి, ఆర్‌జెడి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే సంకేతాలేవీ ఇవ్వలేదు.మహి ళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో హడావిడిగా ప్ర వేశపెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో ఈ రెండు మిత్రపక్షాలు తమ దూకుడును తగ్గిం చాయి.ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టా లన్న ఆలోచన తమకు లేదని సమాజ్‌వాది పార్టీ, ఆర్‌జెడి స్పష్టం చేశాయి.రైల్వే,ఆర్ధిక బడ్జెట్‌కు సంబం ధించి కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లులను సభ ఆమోదం పొందే విషయంలో ఎలాంటి అంతరాయా నికి తావు ఇవ్వరాదని ప్రభుత్వం భావిస్తున్నది.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మహిళా బిల్లును లోక్‌సభలో ఎప్పుడు ప్రవేశపెట్టాలనేది తర్వాత నిర్ణ యిస్తామని ప్రభుత్వం పేర్కొంది.వచ్చే నెలలో పద్దుల తుది ఆమోదం పొందడానికి ముందు వచ్చే ఆర్ధికసంవత్సరం తొలి మూడునెలలకు ఓటాన్ అక్కౌంట్ వ్యయానికి వీలుగా రాజ్యాంగం ప్రకారం మార్చి 31లోగా లోక్‌సభ ద్రవ్య బిల్లులను ఆమోదిం చాల్సిఉంది. తమకు తగిన సంఖ్యా బలం లేనం దున,లోక్‌సభలో ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వ్యతి రేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ప్రతిపాద నను తాము పరిశీలించడంలేదని మరోపక్క ఎస్‌పి అధినేత ములాయంసింగ్ యాదవ్, ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ వేర్వేరుగా విలేకరులకు తెలిపారు.
ఈ రెండుపార్టీలకు కలిపి లోక్‌సభలో 25 మంది ఎం పీలు ఉన్నారు. ఎస్‌పికి 21మంది ఎంపీలు, ఆర్‌జె డికి నలుగురు ఎంపీలు ఉన్నారు.అవిశ్వాస తీర్మా నం ప్రవేశపెట్టి, చర్చకు పరిశీలించాలంటే కనీసం 55మంది ఎంపీలు అవసరం. పరిస్థితిని సమీక్షించ డానికి ఎస్‌పి పార్లమెంటరీ పార్టీ బుధవారం ఇక్కడ సమావేశమైంది. రాజ్యసభలో మహిళా బిల్లు ఆమో దం పొందిన దృష్ట్యా ప్రభుత్వానికి మద్దతు ఉపసం హరించుకుంటామన్న హెచ్చరికను ఎస్‌పి అమలు చేస్తుందా లేదా అని అడగ్గా, దీనిపై పార్టీ నాయ కులు చర్చించి,నిర్ణయం తీసుకుంటారని ములాయం సింగ్ యాదవ్ చెప్పారు. తమ పార్టీ రాష్ట్రపతిని అప్పాయింట్ కోరిందని, ఇప్పటివరకు రాలేదని ఆర్ జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ తెలిపారు.
జెడియులో చీలిక లేదు మహిళా రిజర్వేషన్ బిల్లుపై జనతాదళ్(యు)లో ఎలాంటి చీలికకు అవకాశం లేదని బీహార్ ముఖ్య మంత్రి నితీష్‌కుమార్, ఆయన పార్టీ అధ్యక్షుడు శర ద్ యాదవ్ స్పష్టం చేశారు. అయితే పార్టీలో విభే దాలున్నమాట వాస్తవమేనని అంగీకరించారు. విభ ేదాల కారణంగా నితీష్ పార్టీ నుంచి చీలిపోయి, కొ త్త పార్టీని ఏర్పాటు చేసుకునే అవకాశముందని వచ్చి ''లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు నిచ్చే విషయమై పార్టీలో విభేదాలున్న సంగతిని నేను అంగీకరిస్తున్నాను...అయితే దీనిని పార్టీలో ఏర్పడిన సంక్షోభం లేదా చీలికగా తీసుకోవద్దు అని కుమార్ విలేకరులతో అన్నారు. రాజ్యసభలో ఐదు గురు జెడియు సభ్యులు మహిళా బిల్లుకు మద ్దతుగా ఓటు వేశారు.
పార్టీ అధ్యక్షుడు శరద్‌యాదవ్ మాత్రం బిల్లును ప్రస్తుత రూపంలో నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నారు.కుమార్ జెడియునుంచి చీలిపోయి, కొత్త పార్టీని ఏర్పాటు చేయవచ్చన్న మీడియా వార్తల గురించి ఆయనను ప్రశ్నించగా, ''అటువంటి వార్త లను నేను పట్టించుకోను అని ఆయన అన్నారు. లోక్‌సభలో జెడియుకు 20మంది సభ్యులున్నారు. పార్టీలో చీలిక గురించి న్యూఢిల్లీలో శరద్ యాద వ్‌ను ప్రశ్నించగా, ''ఇది పార్టీ అంతర్గత వ్యవహారం. త్వరలోనే పరిష్కారమవుతుంది అని అన్నారు. నితీష్ కొత్త పార్టీ పెట్టొచ్చని వచ్చిన వార్తల గురించి అడగ్గా, ''అదంతా చెత్త. అటువంటిదేమీ జరగదు అని ఆయన అన్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి అడగ్గా, ''దేశంలో మెజారిటీ ప్రజలు బిల్లు కు వ్యతిరేకంగా ఉన్నందున, మేం బిల్లును వ్యతిరే కించడం కొనసాగిస్తాం అని యాదవ్ తెలిపారు.
రాష్ట్రపతికి లేఖ రాయడం ద్వారా యుపిఎ ప్రభుత్వానికి వెలుపలి నుంచి ఇస్తున్న మద్దతును ఉప సంహరించాలని ఆర్జేడి,సమాజ్‌వాది పార్టీలను బిజెపి కోరింది.రాష్ట్రపతి వద్దకు వెళ్లండి.యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నామని చెప్పండి.మేము మీ వెంట ఉంటాం అని బిజెపి నా యకుడు యశ్వంత్ సిన్హా ఆర్జేడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్,ఎస్‌పి అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌లకు తెలిపారు.ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌ను ములాయం,లాలూ కలిశారు.రాజ్యసభలోసస్పెండ్‌చేసిన సభ్యులను మార్షల్ ద్వారా తొలగించడాన్ని ప్రధాన ప్రతి పక్షం ప్రస్తావించవలసిన అవసరమున్నదని వారు తెలిపారు.ఏడుగురు రాజ్యసభ సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను తొలగించాలని సిపిఐ నాయకుడు గురుదాస్ గుప్తా,సిపిఎం నాయకుడు సీతా రాం ఏచూరి డిమాండ్ చేశారు.
సాధూ యాదవ్‌ను సస్పెండ్‌చేసిన కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్టీ విధానాలను ఉల్లం ఘించినందుకు మాజీ ఎంపీ సాధూ యాదవ్‌ను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది.సాధూ యాదవ్ పార్టీ విధానాలను ఉల్లంఘించడాన్నితీవ్రంగా పరిగణించి ఆయనను సస్పెండ్ చేస్తున్నామని బీహార్ పిసిసి అధ్యక్షుడు అనిల్ శర్మ చెప్పారు.పార్టీనుంచి బహిష్కరణ విషయంలో షోకాజ్‌నోటీస్ జారీచేస్తామని అన్నారు.