| 15 లేదా 16న లోక్‌సభలో మహిళా బిల్లు |
| గురు వారం, మార్చి 11, 2010 , 9:25 [IST] |
 |
|
న్యూఢిల్లీ, మార్చి 10 : రాజ్యసభ ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును 15 లేదా 16వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెడతారు. కానీ శుక్ర వారం సమావేశమయ్యే సభా వ్యవహారాల సల హాకమిటీ (బిఎసి) దీనిపై తుది నిర్ణయం తీసు కొంటుంది. శుక్రవారం బిఎసి సమావేశం జరుగుతుంది.అదే బిల్లును ప్రవేశపెట్టే తేదీని నిర్ణ యిస్తుంది అని న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ విలేఖరులకు తెలిపారు.
ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ మహిళారిజర్వేషన్ బిల్లును 15 లేదా 16 వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెడతారని ఆయనన్నారు. రాష్ట్ర అసెంబ్లీలు, లోక్ సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును లోక్ సభ ఆమోదిస్తుందనేవిశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాజ్యసభలో మెజార్టీతో మంగళవారం మహిళా బిల్లు ఆమోదం పొందింది. ఆర్థిక బిల్లు, ఆర్డినెన్స్‌లను తొలగించే చట్టాలు వంటి అంశాలు అజెండాలోఉన్నట్లు మొయిలీతెలిపారు.
|
|
|
|
|
|
|