యాంగాన్ : మయన్మార్ ప్రతిపక్ష నాయకురాలు అంగ్ సాన్ సూకీ తన సొంత పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. సైనిక ప్రభుత్వ నూతన ఎన్నికల చట్టాల కింద ఈ సంవత్సం ఆమె ఎన్నికల్లోపోటీ చేయడానికి వీల్లేదు.నూతన రాజకీయ పక్షాల నమోదు చట్టాన్ని బుధవారం మయన్మార్ సైనిక ప్రభుత్వం ప్రచురించింది.దీని ప్రకారం జైల్లో ఉన్న వారు ఎన్నికల్లో పోటీచేయడానికి వీల్లేదు.
1990లో జరిగిన ఎన్నికల్లో సూకీకి చెందిన ఎన్‌ఎల్‌డి విజయం సాధించింది.కానీ ఆమె అధి కారాన్ని చేపట్టకుండా సైనికప్రభుత్వం అడ్డుపడింది.ఒక అమెరికన్ ఈదుకుంటూ ఆమె నివాసభవానికి రావడంతో ఆగస్టులో మయన్మార్ సైనికప్రభుత్వం సూకీకి మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది.