| హైతీ బాధితుల సహాయార్థం లియాండర్ పేస్ పిలుపు |
| గురు వారం, మార్చి 11, 2010 , 2:33 [IST] |
 |
|
ముంబయి, మార్చి 10 : ప్రకృతి వైపరీత్యంతో వారి జీవితాలను, ఇళ్లను కోల్పోయిన లక్షలాది మంది హైతీ భూకంప బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాలని భారత ప్రజలకు భారతీయ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ పిలుపునిచ్చాడు. భూకంప బాధితులకు నిధిని సమకూర్చే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భౌగోళికంగా చాలా దూరంలో ఉన్నప్పటికీ హైతీయన్లు కూడా మనలాంటి ప్రజలే అనే విషయాన్ని గుర్తించి భారతీయులందరూ సహాయపడాలని కోరాడు. ముంబయిలోని అమెరికా కాన్సులేట్ జనరల్ పల్ ఫోమ్స్‌బీ, దక్షిణాఫ్రికా కౌన్సుల్ జనరల్ బుసి కుజ్వాయో, భారతీయ మర్చంట్స్‌చాంబర్ చైర్మన్ గుల్ కృపలానీలతో పాటు అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
|
|
|
|
|
|
|