1992: దివంగతప్రధానిరాజీవ్‌గాంధీ ప్రవేశపెట్టిన పంచాయితీరాజ్ చట్టంలో తొలిసారిగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేశారు. 1996: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును అప్పటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభు త్వంలో హెచ్.డి.దేవెగౌడ ప్రతిపాదించారు. సెప్టెంబర్ 1996: 11వ లోక్‌సభలో ఈ బిల్లును తొలుత అప్పటి న్యాయశాఖమంత్రి రమాకాంత్ డి ఖలాప్ ప్రవేశపెడితే దాన్నిగీతాముఖర్జి నేతృత్వం లోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపారు.
డిసెంబర్ 1996: జెపిసి రిపోర్ట్‌ను సమర్పించిం ది. కాని ఫ్రంట్ ప్రభుత్వం మైనారిటీలో పడి బిల్లు ఆమోదం పొందలేక పోయింది. జూన్ 1998: వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం 12వలోక్‌సభలోకూడా ఈ బిల్లును పునర్‌ప్రవేశపెట్టింది. తిరిగి లోక్‌సభ రద్దయింది. బిల్లు మళ్లీ తెర వెనక్కు వెళ్లింది. నవంబర్ 1999: మరోసారి బిల్లును ప్రవేశపెడితే అప్పటి న్యాయశాఖమంత్రి రామ్‌జెఠ్మలాని నుంచి ఎస్.పి. పార్టీ సభ్యుడు ఎస్.పి.సింగ్ లాక్కుని నానా రభస చేశారు.
2000: బిల్లుపై ఏకాభిప్రాయంరాలేదు. కాని ఎన్ని కల సంఘం అన్ని పార్టీలు మహిళలకు సీట్లను రిజర్వు చేయాలని సూచించింది. 2003: బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టకుండా పెద్ద ఎత్తున గొడవ చేశారు. మే 2004: యుపిఎ కామన్ మినిమం కార్యక్రమంలో మహిళా రిజర్వేషన్ అంశాన్ని ప్రతిపాదించారు. మే 2008: మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం తాజా బిల్లుని రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. దీన్ని పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపారు. డిసెంబర్ 2009: జయంతి నటరాజన్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ బిల్లును యధాతథంగా ఆమోదించాలని సిఫారసు చేసింది. ఫిబ్రవరి 25, 2010: కేంద్ర కేబినెట్ బిల్లును ఆమోదించింది.
మార్చి 5, 2010: బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ బిల్లును సమర్థించి ఒబిసిల నేతల వాదనలను బలహీనపర్చారు. మార్చి 8, 2010: ఎస్.పి, ఆర్‌జెడి, ఎల్‌జెడి పార్టీల ఆగ్రహపూరిత వ్యతిరేకత మధ్య బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కాని రభసతో ఓటింగ్‌ను వాయిదా వేశారు. మార్చి 9, 2010: ఎట్టకేలకు చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభ ఆమోదం తెలిపింది. లోక్‌సభ, సగం రాష్ట్రాల ఆమోదం ఇక లాంఛనమే.