మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం
శని వారం, మార్చి 06, 2010 , 2:24 [IST]

vigtibulsపండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు, డ్రైఫ్రూట్స్‌, దుంపలు రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. వ్యాధులు రాకుండా కాపాడుకోగలుగుతారు.
పాలల్లో కాల్షియం మాత్రమే కాదు. ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఆస్టియోపోరోసిస్‌ (ఎముకల బోలు వ్యాధి) రాకుండా పోరాడటంలో ఇవి ఎంతగానో ఉపయోగపడుతుంది. కొవ్ఞ్వ తక్కువగా ఉండే పాల పదార్థాలను రోజుకి మూడుసార్లు తీసుకుంటూ, వ్యాయామం చేస్తుంటే ఎముకలు దృఢంగా తయారవ్ఞతాయి.

చేపలను క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వీటిలో ఎక్కువగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలోని కొలెస్ట్రాల్‌ తదితర కొవ్ఞ్వల స్థాయిలను తగ్గించడానికి తోడ్పడటమే కాకుండా, రక్తాన్ని గడ్డకట్టకుండా కూడా చూస్తాయి. అందుకే వారానికి రెండుసార్లైనా చేపలను తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
రోగ నిరోధక శక్తని పెంపొందించడంలో ఆకుకూరలు చాలా ముఖ్యమైనవి. విటమిన్లు, ఖనిజాలు, బీటా కెరోటిన్‌, విటమిన్‌ సి, ఫోలేట్‌, ఇనుము, మెగ్నీషియం, కెరోటినాయిడ్లు, ఫైటో కెమికల్స్‌, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మెగ్నీసియం ఎక్కువగా లభించే ఆకుకూరలతో మధుమేహ నివారణా సాధ్యమని హార్వర్డ్‌ అధ్యయనంలో తేలింది.

అందుకని తరచూ పాలకూర, తోటకూర, చేమకూర, మెంతి, బచ్చలి వంటి రకరకాల ఆకుకూరలను తీసుకోవాలి. వీటిలో మంచి పీచు పదార్థాలు ఉంటాయి కనుక జీర్ణప్రక్రియ బాగా జరుగుతుంది.
జీడిపప్పు, బాదం, వేరుశనగ వంటి పప్పుల్లో కొవ్ఞ్వలు అధికంగా ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. మోనో, పాలీ అసంతృప్త రకాలకు చెందినవి కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె జబ్బుల నుంచి కాపాడుతాయి. దీఇకి తోడు పప్పుల్లో ప్రొటీన్‌, పీచు, విటమిన్‌-ఈ, విటమిన్‌ - ఎ అధికంగా ఉంటాయి. పప్పులను కొద్ది మోతాదులో తీసుకున్నా ఎక్కువ శక్తినిస్తాయి.

కూరగాయల్లో చాలామంచివి, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొటీన్లు కావాలంటే బీన్స్‌, చిక్కుడు జాతి కూరగాయలను తీసుకుంటే సరి. వీటిల్లో ఫైటోకెమికల్స్‌తో పాటు కొవ్ఞ్వలేని, నాణ్యమైన్లు ప్రొటీన్లు చాలా ఉంటాయి. ఫోలిక్‌యాసిడ్‌, పీచు, ఇనుము, మాంగనీసు కొద్దిగా కాల్షియం కూడా ఉంటాయి. వీటితో కొన్ని రకాల క్యాన్సర్లనూ నివారించుకోవచ్చు. రక్తంలో కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ల మోతాదులను తగ్గించుకోవచ్చు. రక్తంలో చక్కెరస్థాయిని నియంత్రించుకోవచ్చు. వీటితో పాటు టమోటా కూడా చాలామంచిది. కారణం దీనితో క్యాన్సర్‌ వ్యాధి తగ్గుముఖం పడుతోంది. చిలగడదుంప రోగనిరోధక శక్తి బాగా పెంచుతాయి. లేత గులాబీరంగులో చూడగానే నోరూరించే వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. ఫైటో కెమికల్స్‌తో పాటు బీటాకెరోటిన్లు, విటమిన్‌సి, విటమిన్‌ ఈ, ఫోలేట్స్‌, కాల్షియం, రాగి, ఇనుము, పొటాషియం కూడా లభిస్తాయి. వీటిల్లోని పీచు జీర్ణక్రియను పెంపొందిస్తుంది. యాంటీ యాక్సిడెంట్లు గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.
 
ఇవే కాకుండా పండ్లని కూడా ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ప్రతి ఒక్కరూ రోజూ తప్పనిసరిగా తినాల్సిన పండు ఆపిల్‌. ఆపిల్‌ రోజూ తినడం వల్ల డాక్టరుతో పని ఉండదని చెబుతారు. ఆపిల్లో విటమిన్లు, కొవ్ఞ్వలేని కార్బొహైడ్రేట్స్‌ ఉండటం వల్ల ఇది గుండెకు హాని చేయకుండా ఉంటుంది.

ఆపిల్‌ తరువాత శరీరానికి మేలుచేసే మరో పండు బొప్పాయి. ఇందులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు గుండెకు చాలా మేలు చేస్తాయి. అలాగే ఈ పండు శరీరంలోని కొవ్ఞ్వని సైతం కరిగిస్తుంది కాబట్టి బరువ్ఞ తగ్గాలనుకునేవారు ఒకపూట భోజనాన్ని మానేసి ఒక కప్పు నిండా బొప్పాయి పండు ముక్కల్ని తినడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు అందుతాయి. అంతేకాదు ఈ ముక్కలు ఒక కప్పు తింటే కడుపు నిండిన భావన ఉంటుంది కాబట్టి ఇక ఇతర ఆహారం జోలికి వెళ్లాలనిపించదు.
 
 User Comments
[ Post Comments ]  
By: td.madhusekhar
On: 06 Mar 2010 10:10 pm

very nice and good matter

Reply |  Report abuse


[ Post Comments ]
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 విటమిన్‌ బితో పక్షవాతం,..
 సెల్‌తో ఎముకలకు ముప్పు
 చినుకుకాలంలో జాగ్రత్తలు
 పిల్లల్లో చెవిపోటుకు హోమియో
 కాళ్లలోనూ స్టెంట్‌లు
 ఆరోగ్యవరదాయిని తుమ్మ
 న్యుమోనియా శరీరమంతా వ్యాపించే..
 విషాన్ని హరించే మిరియాలు
 కాల్షియంతో ఆర్థరైటిస్‌ దూరం
 ముందు జాగ్రత్తలతో కళ్లు పదిలం
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com