Home » స్వస్థ » క్యాన్సర్ సైలెంట్ కిల్లర్ కాదు!
క్యాన్సర్ సైలెంట్ కిల్లర్ కాదు!
శని వారం, మార్చి 06, 2010 , 2:15 [IST]
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రోగాలు రోజూ చాలామంది ప్రాణాలను బలిగొంటూనే వున్నాయి. ఇందులో అందర్నీ భయపెడతూ, మారుతున్న జీవన విధానాలవల్ల సంక్రమిస్తున్న క్యాన్సర్ మహమ్మారి భారతదేశంలో నిండు జీవితాలను కబళిస్తున్న ప్రాణాంతక వ్యాధిగా నాలుగవ స్థానాన్ని ఆక్రమించింది. దురలవాట్లు, పరిస్థితుల రీత్యా 5 మిలియన్ల భారతీయులు క్యాన్సర్ వాతపడడానికి అవకాశముందని తాజా అధ్యయనంలో వైద్య నిపుణులు వెల్లడించారు.
సంవత్సరంలో ఎనిమిది లక్షల మందికి ఈ వ్యాధి సోకుతోంది. ప్రతీయేటా 5,50,000 మంది క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారు. పొగాకు వాడకంవల్ల మిలియన్ మంది ప్రతీ సంవత్సరం ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ కూడా క్యాన్సర్ వ్యాధి నయం చేయదగ్గదే అంటున్నారు వైద్యశాYసజ్ఞులు. తొలిదశలో కనుక్కోగలిగితే శYసచికిత్స, రేడియోథెరపీ, కీమోథెµెరపీల ద్వారా మనుషుల ప్రాణాలను కాపాడవచ్చు అంటోంది తాజా అధ్యయనం. కాని దురదష్టవశాత్తు 80 శాతం రోగులు చివరిదశలో తప్పితే వైద్యులను సంప్రదించడం లేదని పరిశోధకులు బాధ పడున్నారు.
అందుకే మనదేశంలో ప్రాణాంతక రోగాలలో నాల్గవ స్థానాన్ని క్యాన్సర్ వ్యాధి సంపాదించు కున్నది. దీనికి ముందు గుండె జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు అంటే ట్యూబర్‌క్యులోసిస్, న్యూమోనియా, డయేరియా వంటివి ఉన్నాయి. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రకారం యాభైశాతం క్యాన్సర్ రోగగ్రస్తులు ఢిల్లీ పరిసరాల వారే. అందులో 20 శాతం మొదటి, రెండవ దశల్లో గుర్తించడం జరుగుతోంది. మొదటి రెండు దశల్లోనూ నయంచేయడానికి 80శాతం అవకాశం ఉందని ఇనిస్టిట్యూట్ చెబుతోంది. అదీ ఊపిరితిత్తులకు క్యాన్సర్ సోకిన సందర్భాలలో కూడా. కానీ చాలామంది ఈ రెండు దశల తర్వాత వస్తున్నారు. అప్పుడు నయంచేసే అవకాశం కేవలం 20శాతమే అని అక్కడి వైద్య నిపుణులు వాపోతున్నారు.
కేరళలో 40శాతం కేసులలో అతిశీఘ్రంగా వ్యాధిలక్షణం కనుక్కోవడం జరుగు తోంది. అందుచేత నయం చేసే అవకాశం కూడా ఎక్కువగానే వుంటుంది. అత్యంత ఆధునిక వసతివున్న క్యాన్సర్ పరిశోధనా పరికరాన్ని సమకూర్చుకున్న తొలి ఆరోగ్యసంస్థగా ఆసియా ఖండంలోనే 'ది ఇన్‌స్టిట్యూట్ రోటరీ క్యాన్సర్ హాస్పిటల్ పేరు సంపాదించుకోబోతోంది. ఈ పరికరం ద్వారా చేసే వైద్యంవల్ల ఛాతీ, ఉదరం, కడుపు, పాంక్రియాస్, గాల్‌బ్లేడర్, ఊపిరితిత్తులలో అంకురించబోతున్న వ్యాధి లక్షణాల్ని అవలీలగా కనిపెట్టవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అయితే సమగ్రంగా పరిశీలిస్తే, వివిధ రకాల క్యాన్సర్‌కు 'ఆతిథ్యమిస్తున్న భారతదేశంలో ఈ వ్యాధి, సమూలంగా మట్టుబెట్టడానికి అవసరమైన పరికరాలుగానీ, వైద్య వసతులుగానీ ఇంకా పూర్తిగా సమకూరలేదనే పరిశోధకులు అంటున్నారు. నోటిలోనూ, గాల్‌బ్లేడర్‌లోనూ, అన్నవాహిక పై భాగంలోను ఏర్పడే క్యాన్సర్‌కి అగ్రస్థానాన్ని ఇండియానే వహిస్తున్నట్లు 'ది అట్లాస్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఇండియా వెల్లడించింది.
జాతీయ క్యాన్సర్ రిజిZసీ ప్రోగ్రామ్స్ నేతత్వంలో దేశంలో క్యాన్సర్ తీరును పరిశీలించే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ఈ క్యాన్సర్ అట్లాస్‌ను రూపొందించింది. ఈ అట్లాస్ విభాగం స్పష్టం చేసిన వాస్తవాలు క్యాన్సర్ నిపుణుల్నే కలవరపరచాయి. లక్షమందిలో పదిమంది చొప్పున పిత్తాశయ క్యాన్సర్‌ఉన్న మహిళలతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఇండియా ఉన్నట్టు ఈ సంస్థ తేటతెల్లం చేసింది. పొగాకువల్ల సంక్రమించే క్యాన్సర్‌తో మధ్య, దక్షిణ, మరియు ఉత్తర భారతదేశంలోని జిల్లాలలో లెక్కపెట్టలేనన్ని కేసులు నమోదవుతున్నట్టు ఈ విభాగం ప్రకటించింది.
మిజొరాంలోని అయిజ్వాల్ జిల్లాలో అన్నవాహిక దిగువభాగంలోని నమోదైన క్యాన్సర్ వ్యాధి గ్రస్తులైన పురుషులు, జాబితాలో అగ్రస్థానం వహిస్తున్నారు. నాలుక క్యాన్సర్, కడుపు క్యాన్సర్ లో అక్కడి వారు దేశంలో మిగిలిన రాష్ట్రాలకంటే ఎక్కువగా ఉన్నారు. ఇందులో బెంగుళూరు, చెన్నై లో పురుషులు కూడా అగ్రస్థానంలోనే వున్నారు. లక్షలో తొమ్మిది మందితో పాండిచ్చేరితో నోటి క్యాన్సర్ ఉన్నవాళ్ళు ప్రపంచ రికార్డు నెలకొల్పారు. కేరళ, కర్నాటక, గోవాలో జిల్లాలలో మహిళల్లో థైరాయిడ్ క్యాన్సర్‌ను అత్యధిక శాతం గుర్తించినట్లు ఓ సర్వే వెల్లడిచేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో 'హెలికోబాక్టర్ పైలోరీ అనే క్రిమి కడుపు మరియు గాZసోఇంటస్టైనల్ క్యాన్సర్‌కు బలమైన కారణమని ఆ సర్వే తెలియజేసింది.
క్యాన్సర్‌కు కారణాలు కణాల అభివద్ధికి బాధ్యతవహించే జీన్స్‌లో వచ్చే మార్పులే క్యాన్సర్‌కి కారణమని నిపుణులు అంటున్నారు. ఈ మార్పులే సాధారణ కణాన్ని ట్యూమర్ కణంగా మార్చేస్తాయి. ఈ విధమైన మార్పుకు సంబంధించిన ప్రక్రియ అనేక దశలతో కూడినది ఈ ప్రక్రియ ఫలితంగా వచ్చే క్యాన్సర్‌కు దోహదపడే కారణం బాహ్యపార్శ్వం నుంచి వచ్చేది కావచ్చు లేదా వంశపారంపర్యంగా వచ్చేది కావచ్చు. మితిమీరి టొబాకో నమలడం, అనారోగ్యకరమైన జీవన విధానం, మాలిన్యం, క్రిమి సంహారకాలు, బలహీనమైన ఆహార పదార్థాల వినిమయం, ఊర్ద్వ లేదా వంశపారంపర్యత - వీటిలో ఏదైనా సరే క్యాన్సర్‌కి కారణం కావచ్చు. గ్రామీణప్రాంతాలలో అయితే తరచూ వచ్చే 'మాలిన్యం ఎక్కువ కారణమవుతూ వుంటుంది. దీనికి ప్రత్యక్షంగా కార్యకారణ సంబంధం లేదు. టూకీగా చెప్పాలంటే దీనివల్ల ఇది సంభవించిందని చెప్పడానికి లేదు.
ఈ అనిశ్చిత పరిస్థితే క్యాన్సర్‌ని అరికట్టడానికి ఆస్కారం కల్పించడంలేదు.ఇప్పటికైతే టొబాకో మానిపించడం ఒక్కటే - క్యాన్సర్‌ని అరికట్టడానికి చిక్కిన రహస్యం. పొగాకు శరీరంలో ఏ భాగానికైనా క్యాన్సర్‌ని ముడిపెట్ట గలదు. ఊపిరితిత్తులు, గొంతు, అన్నవాహిక, నోరు, పాంక్రియాస్, గాల్‌బ్లేడర్, కడుపు, కాలేయం, కిడ్నీలు - ఏ భాగమైనా పొగాకువల్ల క్యాన్సర్‌కి గురికావచ్చు. సిగరెట్టు కాల్చే అలవాటు లేకపోయినా, పొగపీల్చి వదిలేవారి పొగను సేవించినా ఊపిరితిత్తుల క్యాన్సర్ రావచ్చు. ఈ రకంగా వ్యాధి బారినపడినవారు కోల్‌కత్తా, ముంబై, ఢిల్లీలో ఎక్కువమందే నమోదవుతున్నారు.
అలాగే మద్యం సేవించడంవల్ల కూడా అన్నవాహిక, కాలేయం, ఛాతీ క్యాన్సర్‌లు సంభవించడం హెచ్చు సందర్భాలలో నమోదవుతోందని ప్రపంచ వైద్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇటీవల గ్రామీణ ప్రాంతాలలో Yసీలకు బిడ్డసంచి క్యాన్సర్‌ల కన్నా వక్షోజాల క్యాన్సరే ఎక్కువ సోకుతోందిట. గ్రామీణ Yసీలు కూడా ఆలస్యంగా వివాహం చేసుకోవడంవల్ల 'ఈZసోజెన్ శరీరాన్ని నాశనం చేస్తోందని అపోలో హాస్పిటల్స్ యొక్క సీనియర్ క్యాన్సర్ సర్జన్‌లు తెలియజేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అయిదోవంతు క్యాన్సర్లు దీర్ఘకాలిక మాలిన్య సంక్రమణవల్ల ఏర్పడుతు న్నాయి. 'హెపటైటిస్ 'బి వైరస్ హెచ్‌ఐవి కాలేయ క్యాన్సర్‌కి దోహదమవుతుంది. 'హ్యూమన్ పాపి ల్లోనూ వైరస్ Yసీల జననేంద్రియ భాగాలకు క్యాన్సర్‌ను అంటగడుతుంది. 'హెలికోబాక్టర్ పైలోరీ పొట్టను గురిపెడుతుంది. 'షిష్టోసోమ్స్ బ్లాడర్‌ను చెడగొడతాయి. హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ (హెచ్‌ఐవి) చర్మానికి దిగువ నుండే నోరు, ముక్కు, గొంతు, ఇతర భాగాలను క్షీణింపచేస్తాయి. అలాగే వయసు పైబడుతున్న కొద్దీ క్యాన్సర్‌సోకే అవకాశముంటుం దని కూడా నిపుణులు అంటున్నారు. వద్ధాప్యం కమ్ముకొస్తున్నకొద్దీ కణాలలో శక్తి తగ్గి 'రిస్క్‌ను తట్టుకునే దారుఢ్యం క్రమేపి మరుగవడంతో క్యాన్సర్ ఆవహించడానికి అవకాశం ఉందని తాజా అధ్యయనం.
గత రెండు దశాబ్దాలలో జీవనకాలం కూడా అనూహ్యంగా పెరగడంతో అనేకమంది క్యాన్సర్ బారినపడుతున్నారని వైద్య శాYసజ్ఞులు అభిప్రాయ పడుతున్నారు. ఎవరూ వద్ధాప్యం కారణంగా మరణించరు. శరీరం నిరోధించలేని ఏదో ఒక వ్యాధికి లొంగిపోతారు.
సైలెంట్ కిల్లర్ కాదు అందరూ అనుకునే దానికి వ్యతిరేకంగా, డెబ్బై శాతం మందికి క్యాన్సరు లక్షణాలు ముందే బైటపడతాయి. నొప్పి బాగా ముదిరిన తర్వాత వస్తుంది. తొలిదశలో లక్షణాలు చాలా సర్వ సామాన్యంగా అనిపిస్తాయి. దానివల్ల కనీస 'రిస్క్ వున్న రోగాలుగా భావించే అవకాశం ఉంది. కొన్ని లక్షణాలు కొన్ని రకాల క్యాన్సర్లలో అయితే ప్రస్ఫు టంగా వుంటాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ సంక్రమించి నవారు మూత్ర విసర్జనలో ఇబ్బందిని అనుభ విస్తారు. అలాగే 'బ్లడ్ క్యాన్సర్ ఫ్లూ జ్వరం లక్షణాలుంటాయి. చాలా మట్టుకు క్యాన్సర్ ట్రీట్‌మెంట్ చాలా సంక్లిష్టంగా వుంటుంది. ఒక్కోసారి శYస చికిత్స, ఆరువారాల రేడియో - థెరపీ, కీమోథెరపీ కలసి వైద్యం జరుగుతుంది. అయితే క్యాన్సర్ నిపుణులు ఎంతో ఆశలను కూడా కలిగిస్తున్నారు. 40 శాతం వరకూ క్యాన్సర్ రోగం పొగాకు మానివెయ్యడం వల్ల, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంవల్ల, చురుకైన జీవితం గడపడంవల్ల నిరోధించవచ్చు అని గట్టిగా చెబుతున్నారు.