మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

Bharathmatrimony
లాగిన్ | రిజిస్టర్
వివాదాల 'కల్కితురాయి
శని వారం, మార్చి 06, 2010 , 1:55 [IST]
ఎస్‌.రహంతుల్లా, ప్రభాతవార్త, శ్రీకాళహస్తి

nigaకల్కి అమ్మా భగవాన్‌ తొలి నుంచి వివాదాలెదు ర్కొంటున్నారు. చిత్తూరు జిల్లాలోని రామకుప్పంలో సుమారు 10 సంవత్సరాల క్రితం సత్యలోక అశ్రమంతో మొదలు పెట్టినప్పుడు కూడా కల్కి అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. స్థానికుల వ్యతిరేకత అధికమై శ్రీకాళహస్తికి సుమారు 40 కిలోమీటర్లు సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాళెంకు మకాం మార్చారు. అక్కడ  అమ్మాభగవాన్‌, గోల్డెన్‌ టెంపుల్‌ అనే మహా సౌధాన్ని నిర్మించి భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. 

ఒకనాటి బడిపంతులు నేటి అమ్మాభగవాన్‌
ఓ సామాన్య బడిపంతులు 'భగవాన్‌ గా మారారు.  ఇదే జిల్లాలోని కుప్పం పరిసరాల్లోని రామకుప్పంలో బడిపంతులుగా ఓ ప్రవేటు పాఠశాలలో చేరిన కల్కి భగవాన్‌ అనే విజయకుమార్‌ యోగాలో కొంత వరకు సాధన చేసి  ఎదుటివారిని ఆకర్షించుకునే శక్తిని సాధించారు. కర్నాటక సరిహద్దుల్లోని రామకుప్పంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని కల్కిభగవాన్‌గా మారారు. అక్కడి నుంచి తన ధార్మిక కార్యక్రమాల్ని ప్రారంభించారు. 'దీక్షలకు శ్రీకారం చుట్టారు. అయితే అక్కడ పలు ఆరోపణలను ఎదుర్కొన్నారు. దాంతో తమ ఆశ్రమ కార్యక్రమాల్ని ప్రశాతం వాతావరణంలో గడపాలని తమిళనాడు సరిహద్దు లోని వరదయ్యపాళెం, బుచ్చినాయుడు కండ్రిగ పరిధిలోని ప్రశాంతంగా ఉండే ఉబ్బల మడుగు అటవీ పరిసరాలను ఎన్నుకున్నారు. ఇది శ్రీకాళహస్తి-చెన్నై రోడ్డు నుంచి సుమారు 8 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ రైతుల నుంచి భూముల్ని కొనుగోలు చేసి క్యాంపస్‌  నిర్మించుకున్నారు.

సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం
సుమారు ఐదేళ్ళపాటు రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించి 42 ఎకరాల విస్తీర్ణంలో వన్నెస్‌ గోల్డెన్‌ టెంపుల్‌ను నిర్మించారు. అత్యాధు నికి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన టెంపుల్‌ ఓ మహోన్నత కట్టడంగా ప్రశంసలందుకుంది. ఈ భవనాన్ని 2008 ఏప్రిల్‌ 21న ప్రారంభించారు.ఆ రోజే  తొక్కిసలాట చోటు జరిగింది. ఆరుగురు చనిపోయారని అధికారికంగా ప్రకటించారు.  కాని వాస్తవంగా ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉంటా రని అనుకున్నారు. ఇది ఆధ్యాత్మిక కేంద్రమైనా సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. కేవలం అమ్మా భగవాన్‌ భక్తులకే ప్రవేశం అనే విమర్శలున్నాయి.

అది కూడా రేటును బట్టి దర్శనం.  స్థాయినిబట్టి అమ్మాభగవాన్‌ దర్శనం ఉంటుందని ప్రచారం జరుగుతుంది. దేశనలుమూలల నుంచి వచ్చే భక్తులు దీక్షలు చేపట్టడానికి కూడా రేటు ఉంటుంది. అంతేకాక విదేశీ భక్తులకు దర్శనం మరింత ప్రత్యేకం. గోల్డెన్‌ టెంపుల్‌ దర్శనం కట్టుదిట్టమైన  భద్రతలో సాగుతుంది.   లోపలకు ప్రవేశించాలంటే ముందుగా అనుమతి అవసరం. ఇక్కడ రిటైర్డ్‌ డివైయస్‌పి పర్యవేక్షణలో భద్రత ఏర్పాటు చేసారు. ఇక్కడకు వచ్చే బాలివుడ్‌, హాలివుడ్‌ తారలు వస్తే కనీసం రెండు రోజులు తిష్ఠ వేస్తుంటారు. వారికి విఐపి ట్రీట్‌మెంట్‌ సరేసరి.  గోల్డెన్‌ సిటి -2లో కేవలం విదేశీయుల కోసమే నిర్మించారు.

రహస్యం గా దీక్షలు చేపట్టాలనుకునే అతిరథµ మహారథులకు ఉబ్బలమడుగు వెళ్ళే దారిలో వున్న క్యాంపస్‌లో అవకాశం కల్పిస్తారు. ఇక్కడ గవర్నర్లు, ముఖ్యమం త్రులు, కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.  హెలికాప్టర్లలో వచ్చే  వారికి హెలిపాడ్‌లు నిర్మించారు. వారు గోల్డెన్‌ సిటీ-2, క్యాంపస్‌ 1,2,3,4ల్లో బస  చేస్తారు. ఈ ప్రాంతాలు విదేశీ భక్తులకు మాత్రమే. స్థానికులకు నో ఎంట్రీ.

దాసాజీలు ఎందుకు దూరమయ్యారు
అమ్మాభగవాన్‌ ఆశ్రమంలో కీలక పాత్ర వహించిన పలువురు దాసాజీలు సాక్షాత్తు అమ్మాభగవాన్‌ కుమారుడు కూడా ఆశ్రమ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉన్నారనేది నేడు చర్చనీయాంశంగా మారింది. ఆశ్రమ ఏర్పాటులో ఎంతో కీలక పాత్ర వహించిన వారు అమ్మాభగవాన్‌తో దూరం కావటానికి కారణాలు ఏమైనా ఇక్కడ ఆధిపత్యపోరు తీవ్రస్థాయిలో ఉందనేది మాత్రం నిజం. అమ్మాభగవాన్‌ కుమారుడు కృష్ణాదాసాజీ ఆశ్రమ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో విదేశీయుల రాకపోకలు, అమ్మాభగవాన్‌ దర్శన కాల్‌షీట్ల పర్యవేక్షణ, జిసి టూ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన ఆనంద్‌దాసాజీ ఇప్పుడు దూరమయ్యారు. అలాగే పాండిచ్చేరి, కోయంబ త్తూరు, నాగర్‌ కోయిల్‌ పరిసరాల్లో అమ్మాభగవాన్‌ ప్రతినిధిగా అక్కడ ఆస్తుల సంపాదనలో ప్రధాన పాత్ర పోషించిన విమలకీర్తిదాసాజీ, భారత దేశ ఇన్‌చార్జిగా నేడు దేశ విదేశాల్లో కల్కిభగవాన్‌, అమ్మాభగవాన్‌లకు విశేష ప్రచారాన్ని అందించిన సమదర్శిని మాతాజీ. ఇలా 41 మంది దాసాజీలు ఆశ్రమంతో తెగతెంపులు తెచ్చుకున్నారు. అలాగే వరదయ్యపాళెం పరిసరాల్లో కల్కి కార్యక్రమాల్లో ఆది నుంచి కీలకపాత్ర వహించిన స్థానిక న్యాయ వాది దశరథయ్య కూడా దూరమయ్యారు. ఇందు లో ఆంతర్యమేమిటన్నది అంతుపట్టడం లేదు. కొందరు దాసాజీలు కలిసి కల్కి ఎడ్యుకేషన్‌ ట్రస్టును ఏర్పాటు చేసారు. ఇది కూడా కల్కి ఆశ్రమంలో చోటు చేసుకున్న వర్గపోరుకు నిదర్శ నంగా చర్చించుకుంటున్నారు.

ఏం జరిగినా కేసులుండవు
2005లో భక్తిభావంతో పూణెనుంచి వచ్చిన ఆషా అనే భక్తురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతదేహాన్ని ఆశ్రమ నిర్వాహ కులే దహనం చేసారు. కానీ ఇప్పటి వరకు ఈ కేసు  విచారణ ఏమైందో, పోలీసులు నివేదిక ఏం ఇచ్చారో అంతుపట్టడం లేదు. అలాగే అదే సంవత్సరం ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ కేసు కూడా  పోలీసు ఫైళ్ళకే పరిమితం అయింది. 2008 ఏప్రిల్‌ 21న గోల్డెన్‌ సిటి ప్రారంభోత్సవంలో అపశృతులు దొర్లాయి. జిల్లా అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వక పోవటంతో ఆరుగురు అధికారికంగా ఆకాల మృత్యువు పాలయ్యారు. ఈ కేసు కూడా పత్రికలు, మీడియాకే పరిమితమైంది. ఈ ఏడాది జనవరి 12న రోడ్డు ప్రమాదంలో జిసి-1 సమీపంలో పవన్‌, వికాశ్‌ అనే ఉద్యోగలు మృతి చెందారు. కానీ అక్కడ ప్రమాదం జరగటానికి ఎలాంటి ఆనవాళ్లు లేవు.  అయితే ఏ సంఘటన జరిగినా పోలీసుల విచారణ మాత్రం శూన్యం అనే చెప్పాలి. దేశ విదేశాల నుంచి వస్తున్న ఉన్నతాధికారుల తీరుతో స్థానిక పోలీసు అధికారులు చొరవ చూపలేకపోతున్నారన్నది జగమెరిగిన సత్యం.

భక్తులకిచ్చే లేహ్యం ఏమిటి?
ఆశ్రమంలో మత్తు పదార్ధాలు వాడుతున్నట్లు బహిరంగంగా విమర్శలు చోటు చేసుకున్నాయి. అయితే ఇక్కడ అలాంటిదేమి లేదని, ఇదో పవిత్ర ఆధ్యాత్మిక దీక్షా కేంద్రం మాత్రమే అని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడకు వచ్చే భక్తులకు లేహ్యం ఇస్తారనే ప్రచారం జరుగుతుంది.  లేహ్యం గురించి విచారించగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఉబ్బలమడుగు పరిసరాల్లోని కొండకొనల్లోంచి స్వచ్ఛమైన జలాలు ప్రవహిస్తుం టాయి. ఈ కాలువల పక్కన ఓ చెట్టు ఉన్నట్లు చెబుతున్నారు. దీనిని పెంచటం నేరం. కాని అడవుల్లో ఎక్కడ బడితే అక్కడ ఎదుగుతుందని చెబుతారు. ఇలాంటి మత్తుకల్గించే చెట్ల ఆకుల్ని వాడతారని చెబుతున్నారు. ఈ పసరును నెయ్యి, తేనే, పచ్చకర్పూరంతో తయారు చేసి ఇస్తారని, ఇది మత్తుమందుల కన్నా ప్రమాదకరమైనదిగా చెబు తారు. దీన్ని సేవిస్తే మనిషి తానేమి చేస్తున్నాడు? అనే విచక్షణ మరిచి తన్మయత్వంలో మునిగి తేలుతారని చర్చించుకుంటున్నారు.

కోట్ల రూపాయల ఆస్తులు
అమ్మాభగవాన్‌ ఆశ్రమానికి వందల కోట్లు రూపాయల స్థిరాస్తులున్నట్లు చెబుతున్నారు. గోల్డెన్‌ సిటి 42 ఎకరాల్లో  నిర్మించారు. ఈ నిర్మాణాన్ని ఎల్‌ అండ్‌ టి సంస్థకు అప్పగించారు. దీని విలువ 127 కోట్లు, జిసి-2లో 32 కోట్ల రూపాయలతో భవనాలు, జిసి-3లో 81 కోట్లతో నిర్మాణాలు చేపట్టారు. తడవద్ద ఉన్న 110 ఎకరాల భూమి విలువ 150 కోట్లు ఉండొచ్చని చెపుతున్నారు. అలాగే చెరువులో 340 కోట్లతో భవనాలు నిర్మిం చారు. అయితే భక్తులు ఇష్టపడి కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నారు. ఆశ్రమం ఎవరిని ప్రత్యేకంగా ఆహ్వానించటం లేదు. కానీ భక్తుల తాకిడి అధికంగా ఉంది. వచ్చిన భక్తులు అమ్మాభగవాన్‌ దర్శనం కోరుకుంటే నిర్వాహకులు విరాళాలు వసూలు చేస్తున్నట్లు కొందరు భక్తుల వివరణ.

అంతేకాక గ్రామాల్లో 'కల్కి గ్రామీణ ట్రస్టు ఏర్పాటు చేసి నిరుపేదలకు సహాయం అందిస్తున్నారు. కానీ ఆశ్రమం ప్రారంభం సందర్భంగా స్థానికంగా 2500 మందికి ఉద్యోగవకాశాలు కల్పిస్తామని ప్రకటిం చారు. నాడు జనరల్‌ మేనేజర్‌గా స్థానిక నాయకుడు న్యాయవాది దశరధయ్య ఉన్నారు.

 
 User Comments
[ Post Comments ]  
Be the first to comment this Article.
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 బెజవాడకు బ్లేడ్‌బ్యాచ్‌ బెడద!
 మహిళలపై నేరాలకు అడ్డాగా..
 పాలను విషంగా మారుస్తున్నారు!
 కస్సుబుస్సుల సిఎం
 గుర్తింపు వ్యవహారంలో విద్యాశాఖ..
 మన కోసమే ప్రకృతి పరిరక్షణ
 గాడితప్పుతున్న వైద్య కళాశాలలు
 భూగర్భ జల సంరక్షణకు కట్టుబడదాం!
 రక్తాన్ని మరిగారు - దోచేస్తున్నారు!
 పిల్లలకు ధరిత్రి పాఠాలు
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com