| వ్యక్తి ఆత్మహత్యయత్నం |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 4:39 [IST] |
 |
|
నూజివీడు రూరల్, ప్రభాతవార్త: మండలపరిధిలోని గొల్లపల్లి గ్రామంలో సోమవారం అనుమానాస్పదరీతిలో బత్తుల కోటేశ్వరరావు(19) అనే యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.
ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కోటేశ్వరరావు సోమవారం పురుగుల మందు త్రాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా, అతన్ని ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యయత్నానికి కారణాలు తెలియరాలేదు. ప్రేమ వ్యవహారం కారణంగా ఆత్మహత్యయత్నానికి పాల్పడి ఉండవచ్చునని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
|
|
|
|
|
|
|