| తవ్మిులేరు నీరు వదిలితే ఊరుకోం - ఆయకట్టుదారుల హెచ్చరిక |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 4:37 [IST] |
 |
|
చాట్రాయి,ప్రభాతవార్త: తవ్మిులేరు నీటిని విడుదల చేసి ఆయకట్టుకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని ఆయకట్టుదారులు హెచ్చరిస్తున్నారు. బలివే తీర్దానికి తవ్మిులేరు నీరు వెళ్లటం అసాధ్యమని, కావాలని నీటిని వృధా చేస్తుంటే ఊరుకోమని ఆయకట్టుదారులు హెచ్చరిస్తున్నారు.
గతంలో సాగునీటికి కూడా నీరు విడుదల చేయటానికి అధికారులు ఒప్పుకోలేదని, ఆయకట్టుకు సంబంధించిన నీటిని నీటి సంపµుం తీర్మానం చేసి తీసు కుంటే కేసులు పెట్టారని, ఇప్పుడు ఆయకట్టు రైతులను కాదని నీరు ఎలా విడుదల చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఈ ఏడాది నీరు తక్కువగా ఉన్నాయని, వర్షాలు లేకపోవ టం వల్ల రైతులు నష్టపోయారని, ఆయకట్టు రైతులకు వ్యతిరేకంగా నీరు విడుదల చేస్తే ఆందోళన చేపడతామని పలువురు హెచ్చరిస్తున్నారు.
|
|
|
|
|
|
|