| విస్సన్నపేటలో 73వ గ్రిగ్ ఆటల పోటీలు |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 4:35 [IST] |
 |
|
విస్సన్నపేట,ప్రభాతవార్త : మండలకేంద్రమైన విస్సన్నపేటలోని సెయింట్‌ధెరిస్సా పాఠశాలలో ఈనెల 16,17 తేదీలలో తిరువూరు సబ్‌జోన్ 73వ గ్రిగ్ ఉపాధ్యాయుల ఆటలపోటీలు నిర్వహించనున్నట్లు స్థానిక జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల పిడి జె.రంగారావు తెలిపారు. ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెంలో జరగాల్సిఉండగా అనివార్య కారణాలవల్ల మార్పుచేసినట్లు ఆయన వెల్లడించారు.
నూజివీడు డివైఇఓ సివియల్ నరశింహారావు ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయిని సిస్టర్ స్వర్ణ ఇన్యాసమ్మ పర్య వేక్షణలో ఆటలపోటీలు జరుగుతాయని ఎంట్రీఫీజులు చెల్లించిన ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తమ ఎంట్రీఫారాలను 15వతేదీ ఉదయం గం.10.00లకు వ్యాయామోపాధ్యాయిని యన్.ఉమామహేశ్వరికి అంద జేయాలని, అదేరోజు మధ్యాహ్నం గం.12.00లకు డ్రా తీయబడుతుందని అధ్యక్ష, కార్యదర్శులు జె.రంగారావు,రమణలు తెలియజేశారు.
|
|
|
|
|
|
|