| మంగు పరిహారం అందలేదని రైతుల ధర్నా |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 4:30 [IST] |
 |
|
బాపులపాడు, ప్రభాతవార్త: మామిడి మంగు తెగులు నష్టపరిహారం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మామిడి రైతులు సోమవారం మండల తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. బాపులపాడు మండలం కొత్త మల్లవల్లి గ్రామానికి చెందిన 37 మంది రైతులు మంగుతెగులు నష్టపరిహారం చెల్లించే జాబితాలో తమ పేర్లు నమోదు కాలేదని అధికారులను నిలదీశారు.
భూమిలో మామిడి మొక్కలు ఉంటే పొగాకు, మొక్కజొన్న, వెరుశెనగ పంటు సాగు చేస్తున్నట్లు నమోదు చేయడంపై ఆగ్రహం వెల్లబుచ్చారు. అధికారులు బయటకు రావాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కార్యా లయం ముందు నినాదాలు చేశారు. దీంతో డిప్యూటి తహశీల్దార్ కోటేశ్వరరావు రైతులవద్దకు వచ్చి మల్లవల్లి గ్రామంలో ఇంకా 350 మంది మామిడి రైతులను ఎంపిక చేయాల్సి ఉందని అన్నారు.
రెండురోజుల్లో గ్రామ రెవిన్యూ అధికారులచే సర్వే జరిపించి మామిడి తోటలు ఉన్న వాళ్ళను నమోదు చేసి, నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఈధర్నా కార్యక్రమంలో మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు షేక్ తనీషా, గారాపత్తి వెంకటే శ్వరరావు, గజ్జల రంగారావు పలువురు మామిడి రైతులు పాల్గొన్నారు.
|
|
|
|
|
|
|