| కొండమీది వీణాదేవిని పరామర్శించిన మంత్రి |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 4:04 [IST] |
 |
|
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన జెడ్పీ చైర్‌పర్సన్ గోనెల విజయలక్ష్మి మేన కోడలు కోండిమీది వీణాదేవిని రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సోమ వారం తల్లంపాడు వెళ్ళి పరామర్శించారు. ఇటీవల వీణాదేవి ఖమ్మం నుండి ద్విచక్రవాహనంపై తన భర్తతో కలిసి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఆమె కాలు విరిగింది. దీంతో మంత్రి ఆమెను పరామర్శించి, ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా తల్లంపాడు గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త కందుల శ్రీనుకు అనారోగ్యంగా ఉండటంతో ఆయన ఇంటికి వెళ్ళి ఆయనను కూడా పరామర్శించారు.
మంత్రితో పాటు కాంగ్రెస్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం, కన్నేటి వెంకటేశ్వర్లు, మానుకొండ రాధాకిషోర్, కళ్లెం వెంకటరెడ్డి, బోడా వెంకన్న, బరిగెల రాంమూర్తి, రేపాకుల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
|
|
|
|
|
|
|