| తీర్థాల జాతరకు 24 గంటల కరెంట్ : ఎ.ఇ. |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 4:02 [IST] |
 |
|
మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 12 నుండి 5 రోజుల పాటు జరిగే తీర్థాల సంగమేశ్వరస్వామి జాతరకు 24 గంటల విద్యుత్‌ను కల్పిస్తున్నట్లు ఖమ్మం రూరల్ ట్రాన్స్‌కో ఎ.ఇ. రఘోత్తమరెడ్డి తెలిపారు.
వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అవాంతరాలు కలిగించ కుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నామని, భక్తుల సౌకర్యార్ధం మంచినీరు ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్లకు, అదే విధంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రైవేటు మోటార్లకు కూడా 24 గంటల విద్యుత్ సౌకర్యం కల్పించి నీటి ఎద్దడి కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
జాతర జరిగే ఈ ఐదు రోజుల పాటు విద్యుత్ సిబ్బంది అక్కడే ఉండి నిరంతరంగా తమ విధులు కొనసాగిస్తూ భక్తులకు అందుబాటులో ఉంటారని చెప్పారు.
|
|
|
|
|
|
|