| 12 నుండి జిల్లాస్థాయి వాలీబాల్ పోటీ |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 4:00 [IST] |
 |
|
ఖమ్మంరూరల్, ప్రభాతవార్త:అఖిల భారత యువజన సమాఖ(ఎఐవైఎఫ్), ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఈనెల12 వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు ఖమ్మంరూరల్ మండలం వరంగల్ క్రాస్‌రోడ్‌లో జిల్లాస్థాయి వాలీబాల్‌పోటీలను నిర్వహి స్తున్నట్లు యువజన నాయకులు వెంపటి వెంకట సురేందర్ తెలిపారు.
ఈ పోటీలకు ముఖ్య్‌అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, పాలేరు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి దండి సురేష్‌లు పాల్గొంటారని తెలిపారు.
ఈ పోటీలు మొదటి బహుమతి 5,116, రెండో బహుమతి 3,166, మూడో బహుమతి 2,116, నాలుగో బహుమతి 1,116రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. క్రీడాకారులు తమ ఎంట్రీలను వివి సురేందర్, వరంగల్ క్రాస్‌రోడ్, ఎ.దుర్గానరేష్ , ఆలీ టైర్స్, వరంగల్ క్రాస్‌రోడ్ చిరునామాలకు పంపాలని కోరారు.
|
|
|
|
|
|
|