మాదాపూర్, ప్రభాతవార్త :గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైన సంఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఖాదర్ కథనం ప్రకారం వివరాల ఇలా ఉన్నాయి.మాదాపూర్‌లోని కుమ్మరిబస్తీలో సోమవారం ఉదయం సుమారు 35 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు.
ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, మృతుడి ఒంటిపై నీలంరంగు చొక్కా ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.
మృతదేహానికి సంబందించి చుట్టుపక్కల ఆధారాల కోసం విచారించినా ఫలితం లేకపోయింది. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.