| షార్ట్ సర్క్యూట్‌తో మెడికల్ షాపు దగ్ధం |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 3:54 [IST] |
 |
|
మియాపూర్, ప్రభాతవార్త : ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యుట్ సంభవించి ఒక మెడికల్ షాపులోని దాదాపు మూడు లక్షల విలువ చేసే మందులు ఇతర సామాగ్రి కాలిపోయిన సంఘటన మియాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... న్యూ హఫీజ్‌పేట్ సుభాస్‌చంద్రబోస్ నగర్‌లో పద్మావతి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్‌ను సాగర్ అనే వ్యక్తి మూడేళ్లుగా నడిపి స్తున్నాడు. కాగా ఎప్పటిలాగే ఆదివా రం రాత్రి పది గంటల సమయంలో షాపుకు తాళం వేసి ఇంటికి వెళ్లాడు.
అయితే రాత్రి ఒకటిన్నర గంటల ప్రాం తంలో కొంత మంది దుకాణం కాలి పోతుందంటూ స్థానికులు యజమానికి సమాచారం అందించారు. ఈ మేరకు సాగర్ సంఘటనా స్థలానికిి చేరుకోగా అప్పటికే దుకాణంలోని కలర్ జిరాక్స్ మిషన్స్ రెండు, ఫ్రిజ్ ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు కాలి బూడిదయ్యాయి. దీంతో షాపు యజమాని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
|
|
|
|
|