| అక్రమాలే కారణం |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 12:17 [IST] |
 |
| గడ్డం పుష్పలత, హైదరాబాద్ |
|
అసలే అంతంత బతుకులు. పూట గడవని జీవనాలు. ఇవన్నీ చాల వన్నట్టు నట్టనడి పట్టణాల్లో కుప్ప కూలే భవనాల ప్రమాదాలు. నాణ్యత లేని భవనాలు అభంశుభం ఎరుగని అమాయక కూలీల చావ్ఞలకు కారణ మవ్ఞతున్నాయి. దీనికి కారణం ఎవరు? ఒక్క యాజమానులే కాదు లంచానికి అలవాటుపడ్డ అధికారులు కూడా దీనికి కారణమే. వీరిద్దరూ కుమ్మక్కై మధ్యలో అమాయకులైన కూలీలు చావ్ఞలకు కారణమవ్ఞతు న్నారు. నాణ్యత లేని ఇసుక, సిమెంట్ వాడకంవల్ల అవి పేక మేడ లుగా కూలుతున్నాయి.
ఇలాంటి నాణ్యత లేని సరుకును అధికారులు ఎలాఆమోదించారు. లంచాలవల్లే ఇటు వంటి దుస్సంఘటనలు జరుగు తున్నాయి. దీనికి కారణమైన యజ మానులను, అక్రమాలకు పాల్పడిన అధికారులను తీవ్రంగా శిక్షించాలి. ఇకముందైనా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కొంతైనా కళ్లెం వేయాలి.
|
|
|
|
|
|
|