మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

Bharathmatrimony
లాగిన్ | రిజిస్టర్
ఆత్మస్వరూపం
మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 12:11 [IST]
బి.కె. అజిత

ఆత్మ జ్యోతిబిందు స్వరూపం గలది. ఆత్మజ్యోతి అని అంటారు. ఇది అమిత సూక్ష్మమైన, దివ్య మైన పారలౌకిక వస్తువు. అవినాశీ అయినటు వంటిది. అమరమైనది. దివ్యచక్షువు ద్వారా మాత్రమే కాంచగలిగినటువంటిది. అబేధ్య మయినది. కత్తితో కత్తిరించడానికి వీలుకాదు. గాలిలో తోయడానికి వీలుకాదు, నీటిలో తడవదు, అగ్నితో కాల్చినా కాలదు. చిన్నగానూ, పెద్దగానూ అవదు. నీటిలో మునగదు. ఏదీ అడ్డుకోవటానికి సాధ్యము కాదు. శరీరానికి మరణము ఆసన్నము అయినపుడు శరీరములో నవరంధ్రాల ద్వారా ఏదో ఒకదాని ద్వారా శరీరమును వదలి వెళ్తుంది అని అంటారు.

ఆత్మస్వరూప స్థితి అత్యంత ఉన్నతమైనది. ఈ స్థితిలో ్చఆత్మశక్తి స్వరూ పముగా, శాంతి స్వరూపముగా, పవిత్రతా స్వరూ పముగా, ఆనంద స్వరూపముగా, ప్రేమ స్వరూపముగా, సుఖ స్వరూపముగా ఉండ గలదు. జ్ఞానము, శక్తి, శాంతి, ఆనందము, ప్రేమ, సుఖము అన్నవి మానవ ఆత్మలలోని మూలగుణాలు. ప్రాక్టికల్‌గా ఈ గుణాలు కర్మల ద్వారా బహిర్గతం కావటమునే స్వరూపము అని అంటారు.
ఈ మూల స్థితికే ఆకర్షణీయముగా ఉంటుంది. ఇటువంటి సౌంద ర్యానికి స్వయము భగవంతుడు కూడా ఆకర్షింపబడతాడు అని అంటారు. ఈ ఆత్మ సౌందర్యము వెలకట్టలేనటువంటిది.

దీని కోసమే యోగులు జ్ఞానులు పురుషార్థం చేస్తూ ఉంటారు. శారీరక,జనన,మరణ చక్రములో వచ్చినటువంటి ఆత్మ కాలక్రమేణా దేహాబి మానానికి వశమై తన మూలస్థితిని కోల్పోయిన కారణముగా ఆత్మ సౌందర్యమును కూడా కోల్పోయింది. కోల్పోయిన మూలస్థితిని తిరిగి పొందాలి అంటే దేహములో ఉంటూ కర్తవ్య నిర్వహణ చేస్తూ కూడా దేహాభిమానమును వదల వలసి ఉంటుంది. ఇందు కొరకు సత్స సాంగత్యాన్ని చేయవలసి ఉంటుంది. సదా ఆత్మా భిమానం అయినటువంటి నిరాకార సత్యశివ సుందరుడితో జ్ఞానయోగాల ద్వారా సత్యమైన  సాంగత్యము తప్పనిసరి. తద్వారా మూల గుణములు, దివ్యగుణములు ప్రాప్తియై, సర్వ ప్రాప్తి సంపన్నతతో చేయవచ్చు. ఇటువంటి జీవితము ధన్యమైనది కదా.
 
 User Comments
[ Post Comments ]  
Be the first to comment this Article.
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 భగవద్గీత
 సువర్ణధారగణపతి
 స్వధర్మాచరణమే కర్మమార్గం
 సత్యం బలమైందిపి
 పూజకు సమయాసమయాలు
 సూక్తులు
 తప్పు వెల
 గురుపూర్ణిమ
 చిత్తశాంతి
 కర్మలంటే ఏమిటీ
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com