| వంటపాత్రల్లోనూ ఉంది రుచి |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 12:07 [IST] |
 |
|
ఏం తింటున్నామో, ఎంత ముఖ్యమో, దేనిలో వంటచేస్తున్నాం- ఏ మెటల్ పాత్రల్లో భోజనం చేస్తున్నాం అనేది గమనించకపోతే మన నాగరికత పెరిగీ ప్రయోజనం లేనట్టే అవుతుంది. లోహపు, నాన్‌స్టిక్ పాత్రల్లో ఆహార పదార్థాలను వండినపుడు వాటిలోని లోహం, కంటికి కనిపించ కుండా ఉండే ప్లాస్టిక్ ఆహారపదార్థాల్లో కలిసే అవకాశం ఉందని పంజాబ్ అగ్రికల్చరల్ యూని వర్శిటీలోని ఫ్యామిలీ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ జరి పిన పరిశోధనాధ్యయనంలో తేలింది.
అల్యూమినియం పాత్రలు తక్కువ ధరలో, తేలిక బరువుతో, మంచి ఉష్ణ వాహకాలుగా ఉండే అల్యూమినియం పాత్రలను వంటకోసం వాడడానికి మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు.
ఆయా పాత్రలో వండుతున్న ఆహారపదార్థాల్లో అల్యూమినియం చాలా సులువుగా కలిసిపోతుం దని, ముఖ్యంగా పాత్రలు ఎక్కువ వాడకం వల్ల రంధ్రాలు, గాట్లు పడినపుడు ఈ ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుందని వారు కనుగొన్నారు. ఇలాంటి పాత్రల్లో ఆహార పదార్థాలను వండినా, వండిన పదార్థాలను నిల్వ చేసినా ఫలితం మాత్రం ఒకేలా ఉంటుందని వారు చెబుతున్నారు. టమాటాలు, చింతపండులాంటి ఆమ్లగుణం కలిగిన పదార్థాలను, సిట్రిక్ యాసిడ్ ఉండే కూరగాయలు అల్యూమినియంను ఎక్కువ మొత్తంలో పీల్చు కుంటాయని వారు హెచ్చరిస్తున్నారు.
వీరు చెప్పే సలహా ఏమిటంటే-అల్యూమినియం పాత్రలను మంచి కండిషన్‌లో ఉంచుకోవాలి. అలాగే ఈ పాత్రల్లో వండడం తప్పదు కాబట్టి వంటకు అధికసమయంలో పట్టే పదార్థాల తయారీకి ఈ పాత్రలను వాడకపోవడం, ఆమ్లగుణం కలిగిన పదార్థాల నిల్వకోసం ఈ పాత్రలను దూరంగా ఉంచడం మంచిదని వారు సెలవిస్తున్నారు.
అలాగే అల్యూమినియం, గిన్నెల్లో కంటే కడాయిలో వండే కూరగాయల్లో మూడురెట్లు అధికంగా, అల్యూమినియం కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనితోపాటు క్రోమియం, లెడ్, కాడ్మియం, నికెల్ వంటి లోహాల శాతమూ పెరుగుతుందని వీరు చెబుతున్నారు. మరి దీని నుండి బయటపడే మార్గం
అనోడైజ్డ్ అల్యూమినియం పాత్రలు వీటితో తయారైన పాన్స్, గిన్నెలు నుంచి ఉష్ణవాహకాలు, ఎక్కువ కాలం మన్నుతాయి. గీతలు పడకుండా ఉంటాయి. శుభ్రం చేసు కోవ డమూ తేలికే. ఆహారపదార్థాల్లో కలిసే అల్యూ మినియం శాతమూ చాలా తక్కువగానే ఉంటుందని వారు చెబుతున్నారు. ఇనుప పాత్రలు మూకుళ్లు, పెనంలాంటి ఇనుప వస్తువులపై కూడా వీరు అధ్యయనం చేశారు. ఎక్కువ బరువుతో ఉండి మంచి ఉష్ణవాహకాలుగా ఉంటాయి. ఈపాత్రలు కూడా ఆహార పదార్థాల్లో ఇనుము శాతాన్ని పెంచు తాయి. కానీ ఎక్కువ మోతాదులో ఆహారపదార్థాల్లో ఇనుము చేరితే పదార్థాలు విషతుల్యం అవుతాయని వారు హెచ్చరిస్తున్నారు. ఈ పాత్రలు వాడని సమయాల్లో తుప్పు పట్టకుండా ఉప్పు కలవని వంట నూనెను ఉపరితలం మీద రాసి ఉంచాలని వీరు సలహా ఇస్తున్నారు. అలాగే వీటిని శుభ్రపరిచేటపుడు ఎక్కువ గాఢత కలిగిన సబ్బులను ఉపయోగించవద్దని కూడా హెచ్చ రిస్తున్నారు.
స్టీలు పాత్రలు దృఢంగా ఉండి ఎక్కువ కాలం మన్నే స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలను కూడా మహిళలు ఎక్కువగా ఇష్ట పడతారు. ఇవి కూడా వంట చేయడానికి అనువైనవిగానే పరిగణించబడతాయి.స్టీల్ తయారీలో ఉపయోగించే ఇనుము, నికెల్, క్రోమియం లోహాలు ఆరోగ్యం మీద ప్రభావం చూపి స్తాయి. అలర్జీ లాంటి రియాక్షన్‌లను కలిగించినా, చాలా తక్కువ పరిమాణాల్లో నికెల్ మంచిదే. స్టీలు పాత్రల్లో వండిన ఆహారపదార్థాల్లో కూడా విషపదార్థాల శాతం ఎక్కువగానే ఉంటుందని, వీటిల్లో ఆమ్లగుణం కలిగిన పదార్థాలను నిల్వచేయకుండా ఉండడమే ఉత్తమమని వారు సెలవిస్తున్నారు.
రాగిపాత్రలు వంట పాత్రలకు ఉపయోగించే మరో లోహం రాగి. వీటిని వంటకు ఉపయోగించేటప్పుడు పాత్రల లోపలివైపు వేరే లోహాలతో కోటింగ్ వేస్తారు. ఈ రాగిపాత్రల్లో ఎక్కువసేపు ఆహారాన్ని ఉడికించినా, ఎక్కువకాలం ఆహారపదార్థాలను నిల్వ ఉంచినా ఆ కోటింగ్ మెల్లమెల్లగా ఆహారంలో కలిసే అవకాశం ఉంది. వీరి పరిశోధనల్లో రాగిపాత్రల్లో వండిన కూరగాయల్లో రకరకాల విషపదార్థాల మూలకాలు పెరుగుతున్నట్టుగా తేలింది.
నాన్‌స్టిక్ పాత్రలు టెఫ్లాస్ కోటెడ్ లాంటి నాన్‌స్టిక్ ఫినిషింగ్ ఉన్న పాత్రలు కొద్దిపాటి ఒత్తిడికే గీతలు పడి కోటింగ్‌లో ఉపయోగించే ఇనర్ట్ ప్లాస్టిక్ సులువుగా ఆహార పదార్థాల్లో కలుస్తుంది. నాన్‌స్టిక్ మూకుళ్లలో వండిన ఆహారపదార్థాల్లో ఉండాల్సిన దానికంటే అధికంగా కాడ్మియం, క్రోమియం, అల్యూమినియం మూలకాల ఆనవాళ్లు కనిపించాయి. ఒకవేళ ఈ పాత్రలను వాడుతుంటే అధిక ఉష్ణోగ్రతకు గురిచేయకూడదని, వంట చేసేటపుడు మధ్యలో కలపడానికి లోహపు, చివర్లు పదునుగా ఉండే చెంచాలను ఉపయోగించకూడదని చెబు తున్నారు.
ప్లాస్టిక్ పాత్రలు మరికొంతమంది ఆహారపదార్థాలను నిల్వచేయ డానికి, ఫ్రిజ్‌లో పెట్టడానికి, మైక్రో ఓవెన్ ఫ్రెండ్లీ అని ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగిస్తారు. వీటివల్ల కూడా ఆరోగ్య సమస్యలు అధికంగానే ఉంటాయి. వీటిని వీలయినంత దూరంగా ఉంచాలంటారు వారు. వీటి నుంచి రక్షణ ఎలా? అయితే ఈవిష ప్రభావాన్ని తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పరిశోధకులు చెబుతున్న కొన్ని చిట్కాలు ఇవి: ్శ వంట పూర్తయిన తరువాత ఆహారపదార్థాలను ఎక్కువసేపు అల్యూమినియం పాత్రల్లో ఉంచ కుండా గాజుపాత్రల్లో నిల్వచేయాలి. ్శ వేడి ఎక్కువగా ఉండే ద్రవపదార్థాలను తాగడానికి స్టేరోఫోమ్ కప్పులను ఉపయోగించకూడదు. పప్పులు, పిండి లాంటి ఆహారపదార్థాలను నిల్వచేయడానికి కూడా కోటింగ్ లేని లేదా కోటింగ్ పోయిన రాగి, ఇత్తడిడబ్బాలను ఉపయోగించవద్దు.
వివిధ రకాలుగా కాలుష్యప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనివల్ల మనకు తెలియకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా శరీరంలోకి చేరే విష పదార్థాల శాతమూ పెరిగిపోతోంది. మంచి ఆరోగ్యం కోసం శరీరాన్ని విషపదార్థ రహితంగా చేయడం అత్యవసరం. అందుకే ఈ పనిని డిటాక్సిక్ డైట్ అనే పేరుతో చాలా కఠినంగా అమలు చేయాలని చెబుతున్నారు.
దీనిలో భాగంగా మంచి ఆహారం తీసుకోవడం, వండేటపుడు ఆహారం కాలుష్యం కాకుండా జాగ్రత్తలు పాటించాలని సైంటిస్టులు అంటున్నారు. ఇలా శరీరాన్ని విషరహితం చేసే ప్రక్రియలో ఉన్నపుడు పాల ఉత్పత్తులు, పప్పులు, గింజ ధాన్యాలు, టీ, కాఫీ, మాంసాహారం, నూనె పదా ర్థాలకు దూరంగా ఉండాలని ఈ పదార్థాలను నెలకు రెండు లేదా మూడుసార్లు మాత్రమే ఉపయోగిం చాలని వారు అంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కుటుంబమంతా ఒక నిర్ణీత కాలపరిమితిని పెట్టుకోవాలి.
ఆ రోజుల్లో కేవలం, పండ్లు, ఆవిరిమీద ఉడికించిన లేదా పచ్చి కూరగాయలు, కాలీఫ్లవర్, క్యారట్, క్యాబేజీ, బీట్‌రూట్, బంగాళాదుంపలు, బీన్స్‌లాంటి మాత్రమే ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు. ఒకటి లేదా రెండు కప్పుల కూరగాయలు ఉడికించిన నీళ్లు, ఒక కప్పు తృణధాన్యాలు బ్రౌన్‌రైస్ లాంటి వాటిని మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. ఈ డిటాక్సిక్ డైట్‌లో ఉన్నపుడు ఉప్పు, చక్కెరలను చాలా తక్కువ మోతాదుల్లో తీసుకోవాలని కూడా వారు చెబుతున్నారు.
ఇత్తడిపాత్రలే మేలు తాగేందుకు వాడుకునే నీళ్లను ఇత్తడి పాత్రలలోనే ఉంచమనేది పెద్దల సూచన. దీనిని మరచిపోయి స్టీలు బిందెలు, ప్లాస్టిక్ పాత్రలను నీళ్ల నిలువకు వాడి ఎంతపొరపాటు చేస్తున్నామో ఇప్పుడు విదేశీ యులు సశాస్త్రీయంగా తెలియచెపుతున్నారు.చాలా దేశాల్లో నీటిలో పెరిగే సూక్ష్మజీవుల వల్ల ప్రజలకు వ్యాధులు సంక్రమిస్తున్నాయి.అటువంటి సూక్ష్మ జీవులను పెరగనివ్వని గుణం ఇత్తడి పాత్రలకుంది. ఇత్తడిపాత్రల తయారీకి రాగి, తుత్తునాగం కలిపి వాడతారు.
ఇందులోని రాగి ప్రభావాన నీటిలో సూక్ష్మజీవులు పెరగవు. ఒకేరకమైన నీరు ఇత్తడి, స్టీల్, ప్లాస్టిక్ పాత్రలలో ఉంచి 48 గంటల తర్వాత పరిశీలించినపుడు స్టీల్, ప్లాస్టిక్ పాత్రలలోని నీటిలో ప్రమాదకర బ్యాక్టీరియాల సంఖ్య గణనీయంగా పెరిగి నా, ఇత్తడి పాత్రలో బ్యాక్టీరియాలు పూర్తిగా తగ్గిపోయాయి.
|
|
|
|
|
|
|