| ఆస్ట్రేలియా వలస విధానం పటిష్టం |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 12:05 [IST] |
 |
|
మెల్‌బోర్న్ ఫిబ్రవరి 8:- వంటపనివారు, హెయిర్‌డ్రెస్సర్లు తమ దేశంలోకి వలస రాకుండా అడ్డుకొని ఎక్కువ నైపుణ్యంగల ప్రజలు వచ్చేలా చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తన వలస నిబంధనలను పటిష్టం చేసింది. దీనితో విదేశీ విద్యార్థులు చేసుకున్న దరఖాస్తుల్లో 20వేల దరఖా స్తులను తిరస్కరించే అవకాశం ఉంది. అందులో భారతీయ విద్యార్థులు కూడా ఉంటారు.
ఇక ముందు డాక్టర్లు, ఇంజనీర్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి చెందిన వారు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందని, వీరి అవసరం ఆస్ట్రేలియాకు ఉన్నదని వలస శాఖ మంత్రి క్రిస్ ఎవాంగ్స్ పేర్కొ న్నారు. డాక్టర్లు, నర్సుల కంటే హెయిర్‌డ్రస్సర్లకు ప్రాధాన్యత ఇవ్వడం తప్పిదమేనని ఆయన పేర్కొన్నారు. విధాన లోపం వల్లనే ఇది జరిగిందని పేర్కొన్నారు.
|
|
|
|
|
|
|