| మార్కెట్లోకి ఆకాయ్ బ్యాటరీలు |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 12:22 [IST] |
 |
|
హైదరాబాద్, ఫిబ్రవరి 8, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ పరికరాలు ఉత్పత్తి చేసే జపాన్‌కు చెందిన ఆకాయ్ కంపెనీ రాష్ట్ర మార్కెట్లోకి బ్యాటరీలు, ఛార్జర్‌లను విడుదల చేసింది.
ఈ సందర్బంగా కంపెనీ బిజినెస్ హెడ్ ఎస్‌ఎల్ నారాయణ మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏడు శాతం వాటా దష్టి పెట్టినట్లు ఆయన వివరించారు. రాష్ట్ర మార్కెట్లో రూ.25 కోట్ల నుంచి 30కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కంపెనీ నుంచి భవిష్యత్తులో మొబైల్ బ్యాటరీలు ఉత్పత్తి చేసే అవకాశం కూడా ఉందని తెలిపారు.
ఈ బ్యాటరీల మార్కెట్ దేశ వ్యాప్తంగా రూ.1800 కోట్లుగా ఉందని, మొదటి దశలో ఈ బ్యాటరీలను తొమ్మిది రాష్ట్రాలలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీ 1200 పైగా ఛానల్ పార్ట్‌నర్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు.
కంపెనీ నుంచి మార్కె ట్లోకి విడుదలయ్యే బ్యాటరీల శ్రేణి జింక్ క్లోరైడ్, ఆల్కలైన్, రీఛార్జబుల్ కలవు. అలాగే కంపెనీ నుంచి త్వరలో సిఎఫ్‌ఎల్ బల్బ్‌ను కూడా విడుదల చేయనున్నట్లు చెప్పారు. కంపెనీ ఉత్పత్తి చేసిన వస్తువులకు లైసెన్స్ హోల్డింగ్‌గా యూనిటెక్ వ్యవహరిస్తున్నది.
|
|
|
|
|
|
|